ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ ట్రాన్స్‌జెండర్‌తో ఓ యువకుడి అసహజ బంధం.. రహస్యం బయటపడుతుందేమోనని అతడి భయం.. చివరకు ఊహించని సీన్..!

ABN, First Publish Date - 2022-07-19T21:36:13+05:30

ఆ యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. అతడిని కలిసేందుకు తరచుగా వేరే ఊరి నుంచి వచ్చాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడు ఓ ట్రాన్స్‌జెండర్‌తో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. అతడిని కలిసేందుకు తరచుగా వేరే ఊరి నుంచి వచ్చేవాడు.. ఆ ట్రాన్స్‌జెండర్‌కు తనతోనే కాకుండా వేరే మగవారితో కూడా సంబంధాలున్నట్టు ఇటీవలె అతడికి తెలిసిందే.. తన అసహజ బంధం గురించి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.. ఆ ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేశాడు.. అనంతరం తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. మధ్యప్రదేవ్‌లోని బెతుల్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Mumbai Police: పదో తరగతి ఫలితాల గురించి టెన్షన్ పడుతున్న విద్యార్థికి ముంబై పోలీసుల రిప్లై ఏంటంటే..


బెతుల్‌కు చెందిన హరిఓం అనే యువకుడు సరణిలోని ఓ నర్సరీలో వాచ్‌మెన్‌గా ఉండేవాడు. అతను నాగ్‌పూర్‌కు చెందిన నిక్కీ అనే ట్రాన్స్‌జెండర్‌తో స్నేహం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా మొదలైంది. నిక్కీని కలిసేందుకు హరిఓం తరచుగా నాగ్‌పూర్ వెళ్లేవాడు. నిక్కీ ఇతర అబ్బాయిలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్టు ఇటీవల హరిఓంకు తెలిసింది. ఆ విషయమై జూలై 14వ తేదీ రాత్రి నర్సరీలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నిక్కీ గొంతును తాడుతో కోసి హరిఓం చంపేశాడు. అనంతరం భయంతో హరిఓం కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-07-19T21:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising