ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. భార్యను చంపి ముక్కలుగా కోసి కాల్చుకుని తినేశాడు.. అతను చేసిన ఘోరం ఎలా బయటపడిందంటే..

ABN, First Publish Date - 2022-02-13T21:48:22+05:30

అతను అత్యంత కిరాతకుడు.. రెండో పెళ్లికి భార్య అడ్డంకిగా మారిందనే కోపంతో ఆమెను హతమార్చాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను అత్యంత కిరాతకుడు.. రెండో పెళ్లికి భార్య అడ్డంకిగా మారిందనే కోపంతో ఆమెను హతమార్చాడు.. తను చేసిన నేరం బయటపడకూడదని ఆమె శరీరాన్ని కాల్చుకుని తినేశాడు.. అనంతరం ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు.. కొన్ని రోజులు ఆగి రెండో వివాహం చేసుకున్నాడు.. నెలల పాటు విచారణ సాగించిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయం తేల్చారు.. అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.. కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించగా కొన్ని నెలలకే జైలు నుంచి తప్పించుకున్నాడు.. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కాడు.. 


బ్రెజిల్‌కు చెందిన మౌరో శామ్‌‌పెట్రి (59) తన భార్య క్లాడెట్ (52)తో రెండు దశాబ్దాలు పాటు వైవాహిక జీవితం సాగించాడు. అయితే మౌరో మరో మహిళతో ప్రేమలో పడి భార్య క్లాడెట్‌ను దూరం చేసుకునేందుకు ప్రయత్నించాడు. తన రెండో పెళ్లికి క్లాడెట్ అడ్డంగా ఉందని భావించి ఆమెను చంపేందుకు పథకం వేశాడు. 2017లో ఆమెను చంపేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ మాంసాన్ని కొలిమిలో కాల్చి ఆ మాంసాన్ని తినేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు. 


కొన్ని రోజుల అనంతరం తన ప్రియురాలిని వివాహం చేసుకొని కాపురం పెట్టాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు క్లాడెట్ కోసం ఎంతగానో గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. చివరకు మౌరో మీద అనుమానంతో ఇంటి ఆవరణను క్షుణ్నంగా పరిశోధించారు. ఒకచోట ఎముకల అవశేషాలు లభించాయి. వాటిని డీఎన్‌ఏ టెస్ట్‌కు పంపగా అవి క్లాడెట్‌వేనని తేలింది. దీంతో మౌరోను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పేశాడు. కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 


కొన్ని నెలల పాటు జైలులో ఉన్న మౌరో సిబ్బంది కళ్లుగప్పి అక్కణ్నుంచి తప్పించుకున్నాడు. మారు వేషం వేసుకుని పోలీసులకు చిక్కకుండా ఐదేళ్ల పాటు బయట తిరిగాడు. ఇటీవల ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కాడు. మొదట తాను ఇటలీకి చెందిన వ్యక్తినని బుకాయించాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు. 

Updated Date - 2022-02-13T21:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising