ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాపింగ్ చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. దాన్ని చూసి హడలిపోయిన యువకుడు.. పడిపడి నవ్వుతున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-01-08T21:41:16+05:30

కొందరు పాములను చేతిలో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తారు. మరికొందరేమో అది కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తారు. ఈ రెండవ కోవకు చెందిన ఓ యువకుడి సంబంధిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొందరు పాములను చేతిలో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తారు. మరికొందరేమో అది కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తారు. ఈ రెండవ కోవకు చెందిన ఓ యువకుడి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ఆ యువకుడు చేసిన పని చూసి.. నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



ఓ యువకుడు స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్‌లోకి వెళ్లి షాపింగ్ చేస్తుండగా.. అక్కడకు సడన్‌గా పాము ఎంట్రీ ఇచ్చింది. ఆ పామును గమనించిన యువకుడు భయాందోళనలతో పరుగులు తీశాడు. ఈ క్రమంలో కొందరు నవ్వడాన్ని గమనించిన ఆ యువకుడు.. దాన్ని బొమ్మపాముగా గుర్తించాడు. కొందరు తనను ప్రాంక్ చేస్తున్నట్టు గ్రహించాడు. వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. బొమ్మపామును చేతిలోపట్టుకుని దాన్ని విరిచేయడానికి ప్రయత్నించాడు. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. బొమ్మపామును చూసి పరుగులు తీసిన యువకుడిని చూసి, నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. 






Updated Date - 2022-01-08T21:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising