ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలిని చంపేసి.. పాతి పెడుతుండగా.. అనుకోకుండా అతనికి చెమటలు పట్టాయి.. ఇంతలోనే అక్కడ ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-05-25T09:45:26+05:30

తనతో చాలా కాలంగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అమానుషంగా చంపేశాడతను. ఇంట్లో ఉన్న ఆమె శవాన్ని ఒక సంచిలో వేసుకొని తోటలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఒక గొయ్యి తవ్వి ఆ శవాన్ని పాతిపెట్టడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా ఆమెను పాతిపెడుతున్న సమయంలోనే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనతో చాలా కాలంగా సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అమానుషంగా చంపేశాడతను. ఇంట్లో ఉన్న ఆమె శవాన్ని ఒక సంచిలో వేసుకొని తోటలోకి తీసుకొచ్చాడు. అక్కడ ఒక గొయ్యి తవ్వి ఆ శవాన్ని పాతిపెట్టడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా ఆమెను పాతిపెడుతున్న సమయంలోనే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలో వెలుగు చూసింది. 


స్థానికంగా నివశించే జోసెఫ్ మెక్‌కినన్ (60) తన ప్రియురాలు పెట్రిసియా డెంట్ (65) చాలా కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెతో ఏదో గొడవ పడిన అతను.. పెట్రిసియా గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని తోటలో పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తోటలో ఒక గొయ్యి తవ్వి.. ఆమె శవాన్ని ఒక సంచిలో వేసుకొని వచ్చాడు. ఆమెను పాతిపెడుతుండగా హార్ట్ ఎటాక్ రావడంతో అతను కూడా అక్కడే పడిపోయి మరణించాడు. 


తోటలో ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన అధికారులకు గోతిలో ఉన్న ఇంకో శవం కనిపించింది. పోస్టుమార్టంలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో ప్రియురాలిని మెక్‌కిననే చంపినట్లే తేలిందని, ఆ తర్వాత హార్ట్ ఎటాక్‌తో అతను మరణించాడని తెలియజేశారు.

Updated Date - 2022-05-25T09:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising