ఊర్లో అందరి ముందు బావ చెంప పగలకొట్టిన యువతి.. పగతో రగిలిపోయిన అతను సినీఫక్కీలో ఏం చేశాడంటే?..
ABN, First Publish Date - 2022-01-12T08:10:43+05:30
భార్యభర్తల గొడవ గ్రామ పెద్దల ముందుకు వచ్చింది. రచ్చబండ వద్ద విచారణ జరుగుతూ ఉండగా.. గ్రామస్తులందరి ముందు ఆ భార్య చెల్లెలు తన బావ చెంప చెళ్లుమనిపించింది. అందరి ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేని అతను పగ తీర్చుకోవడానికి తన మరదలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగలేదు..
భార్యభర్తల గొడవ గ్రామ పెద్దల ముందుకు వచ్చింది. రచ్చబండ వద్ద విచారణ జరుగుతూ ఉండగా.. గ్రామస్తులందరి ముందు ఆ భార్య చెల్లెలు తన బావ చెంప చెళ్లుమనిపించింది. అందరి ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేని అతను పగ తీర్చుకోవడానికి తన మరదలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆమె చనిపోయాక కూడా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు.
ఇదంతా చేసి సినీఫక్కీలో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లా పరిధి బాజిద్పూర్ గ్రామానికి చెందిన షౌకత్ అనే యువకుడికి తన భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవ గ్రామ పెద్దల వద్దకు చేరింది. రచ్చబండ వద్ద షౌకత్, అతని భార్య మధ్య తలెత్తిన గొడవ గురించి విచారణ జరుగుతూ ఉండగా.. షౌకత్ మరదలు(భార్య చెల్లెలు) ఒక్కసారిగా లేచి తన బావ చెంప మీద బలంగా కొట్టింది. ఆ గొడవను గ్రామ పెద్దలు ఎలాగోలా సర్ది చెప్పి పంపించారు. అంతా సమసిపోయిందని అందరూ అనుకుంటుండగా.. షౌకత్ మనసులో మాత్రం తన మరదలు చేసిన అవమానానికి పగ పెంచుకున్నాడు.
ఒకరోజు షౌకత్ అత్తవారింట్లో అందరూ పనిమీద ముజఫర్‌పూర్ నగరానికి వెళ్లారు. ఆ సమయంలో షౌకత్ మరదుల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది తెలిసిన షౌకత్ తన అత్తారింటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న తన మరదలిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఒక బండరాయితో ఆమె తలపై పదేపదే కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగక ఆమె మృతదేహంపై కూడా అత్యాచారం చేశాడు. హత్య చేసిన తరువాత తప్పించుకోవడానికి హత్యకు దొంగతనంగా చిత్రీకరించాడు. ఇంట్లో సామానంతా చెల్లాచెదురు చేసి.. బంగారు నగలని కాజేసి పారిపోయాడు.
హత్య, దొంగతనం కేసుగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు షౌకత్‌ను ప్రశ్నించగా.. అతను చెప్పిన మాటలు సరిగా కుదరకపోవడంతో అతనిపై అనుమానం వచ్చింది. ఆ తరువాత పోలీసులు షౌకత్‌ను అనుమానంపై అరెస్టు చేసి.. తమ పద్ధతిలో విచారణ చేశారు. దీంతో షౌకత్ తన నేరాన్ని అంగీకరించాడు. తన మరదలు ఊర్లో అందరి ముందు తనను ఘోరంగా అవమానించడంతో పగ తీర్చుకోవడానికే అలా చేశానని షౌకత్ ఒప్పుకున్నాడు.
Updated Date - 2022-01-12T08:10:43+05:30 IST