ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేబీసీ(మీలో ఎవరు కోటీశ్వరుడు) పేరుతో రూ.90 లక్షల దోపిడీ.. ఒడిశాకు చెందిన సైబర్ నేరస్థుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ABN, First Publish Date - 2022-03-01T05:46:42+05:30

అతను పలువురు లక్షాధికారులకు వివిధ వర్చువల్ నెంబర్ల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేస్తాడు.. కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరుడు) కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.. మీరు విజేతగా నిలిచారని చెబుతాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను పలువురు లక్షాధికారులకు వివిధ వర్చువల్ నెంబర్ల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేస్తాడు.. కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరుడు) కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.. మీరు విజేతగా నిలిచారని చెబుతాడు.. ప్రైజ్‌మనీ రూ.కోటి కావాలంటే ముందుగా కొంత డబ్బు అకౌంట్లో జమ చేయాలని అడుగుతాడు.. అలా అతను ఇప్పటివరకు వివిధ వ్యక్తులను మోసం చేసి రూ.కోటి దోచుకన్నాడు. 


ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన సైబర్ నేరగాడు జన్మజయ్ దాస్‌ జార్ఖండ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, డెహ్రాడూన్‌లలో నగరాలలో సైబర్ మోసాలకు పాల్పడ్డాడు. కేబీసీ పేరుతో ఎంతో మందిని మోసం చేసి ఇప్పటివరకు రూ.90 లక్షలు కాజేశాడు. రాంచీకి చెందిన ప్రభు మహ్తో అనే వ్యక్తి ఈ ఉదంతంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు జన్మజయ్‌ను అరెస్ట్ చేశారు. ఫోన్ ట్రాకింగ్, బ్యాంకు లవాదేవీల ఆధారంగా ఆ సైబర్ నేరగాడిని పట్టుకున్నారు.


పోలీసుల కథనం ప్రకారం..జన్మజయ్‌ కేబీసీ పేరుతో చాలా మందిని మోసం చేశాడని, తనే స్వయంగా ప్రశ్నలు అడిగి విజేతగా ప్రకటించేవాడని, ప్రైజ్‌మనీ రావాలంటే ముందుగా జీఎస్టీ చెల్లించాలని బాధితులను అడిగేవాడు. చాలా మంది తిరస్కరించినా, కొందరు మాత్రం అతను చెప్పిన అకౌంట్లో డబ్బులు వేసి మోస పోయేవారు. ఎట్టకేలకు పోలీసులు అతడి మోసాలకు అడ్డుకట్ట వేశారు. 

Updated Date - 2022-03-01T05:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising