ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేసి ప్రేయసికి షాకిద్దామనుకున్నాడు.. చివరకు జరిగిందేమిటంటే..

ABN, First Publish Date - 2022-07-01T21:02:40+05:30

తను బాగా ఇష్టపడుతున్న వ్యక్తికి ప్రపోజ్ చేసే ముందు అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎంతో ఆలోచిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తను బాగా ఇష్టపడుతున్న వ్యక్తికి  ప్రపోజ్ చేసే ముందు అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎంతో ఆలోచిస్తారు. ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అని రిహార్సల్స్ వేసుకుంటారు. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఓ ఖరీదైన రిసార్ట్ బుక్ చేశాడు. సరస్సు ఒడ్డుకు తీసుకెళ్లి డైమండ్ రింగ్ ఇచ్చి ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. చివరి క్షణం వరకు అంతా బాగానే జరిగింది. అయితే ప్రపోజ్ చేసే సమయంలో డైమండ్ రింగ్ అతడి చేతిలో నుంచి జారిపోయి చెరువులో పడిపోయింది. 



ఇది కూడా చదవండి..

రైలులో టీ తాగిన ప్రయాణికుడికి షాక్.. కప్పు టీ రూ.70.. అసలు విషయం ఏంటంటే..


UKలోని వాటన్‌లోని విస్పీకి చెందిన రాస్ బాంబర్ అనే వ్యక్తి తన ప్రేయసి గెరీ యాష్‌ఫోర్త్‌కు వివాహ ప్రతిపాదన చేసేందుకు సిద్ధమయ్యాడు. విలాసవంతమైన రిసార్ట్, డెక్‌ను అద్దెకు తీసుకున్నాడు. డైమండ్ రింగ్‌తో తన భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు ప్లాన్ చేశాడు. తన జీవితంలో అపురూపమైన క్షణాన్ని రికార్డు చేసేందుకు కెమేరాను కూడా సిద్ధం చేశాడు. అయితే బాక్స్ నుంచి రింగ్ బయటకు తీస్తుండగా అది జారి సరస్సులో పడిపోయింది. దీంతో బాంబర్ షాకయ్యాడు. 


బాంబర్, అతని స్నేహితులు సరస్సు నుంచి ఉంగరాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరుసటి రోజు బాంబర్ మరొక ఉంగరాన్ని కొనుగోలు చేసి ప్రపోజ్ చేశాడు. ఈసారి అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది.

Updated Date - 2022-07-01T21:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising