ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమ.. పెళ్లి చేసుకుందామని ఆ యువకుడు అడిగాడు.. ఆమె నిరాకరించడంతో అతనేం చేశాడంటే..

ABN, First Publish Date - 2022-01-26T06:14:37+05:30

ఒకరోజు ఆ అమ్మాయిని ఊరి చివర పిలిచి మళ్లీ పెళ్లి విషయం గురించి అడిగాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఒక కత్తితో ఆమెపై దాడి చేశాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక యువతి రెండేళ్లుగా ఒక యువకుడిని ప్రేమించింది. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం ఆ అమ్మాయికి ఎన్నోసార్లు చెప్పాడు. కానీ దీనికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒకరోజు ఆ అమ్మాయిని ఊరి చివర పిలిచి మళ్లీ పెళ్లి విషయం గురించి అడిగాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించకపోవడంతో ఒక కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందంటే..


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  గోరఖ్‌పూర్ సమీపంలోని సోనబర్సా గ్రామానికి చెందిన గౌతమ్(23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. రెండేళ్లుగా ఆ అమ్మాయి అతడిని వెంట తిప్పుకుంటూనే ఉంది. కానీ అతను మాత్రం ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఎన్నోసార్లు పెళ్లి గురించి తన ప్రేయసిని అడిగాడు. అయితే పెళ్లి మాట ఎత్తగానే ఆమె మాట మార్చేసేది. 


ఈ క్రమంలో ఒక రోజు గౌతమ్ తన ప్రియురాలిని ఊరి చివర ఉన్న గుడి వెనుక రమ్మనాడు. అక్కడ గౌతమ్ ఆమెను మళ్లీ పెళ్లి చేసుకుందామని అడిగాడు. దానికి ఆమె పెళ్లిచేసుకునేదిలేదని తేల్చి చెప్పేసింది. ఇది వినగానే గౌతమ్‌కు పట్టనంత కోపం వచ్చింది. తన వద్ద ఉన్న కత్తి తీసుకొని ఆమెపై దాడి చేశాడు.  ఆ దాడిలో ఆ యువతి చేతి వేళ్లు తెగిపోయాయి. దీంతో ఆ అమ్మాయి భయపడిపోయి గట్టిగా అరిచింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. గౌతమ్ చేతిలో కత్తి చూసి అతడిని పట్టుకొని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గౌతమ్‌ని అరెస్టు చేశారు.

Updated Date - 2022-01-26T06:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising