ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!

ABN, First Publish Date - 2022-06-24T01:07:55+05:30

కొందరు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించి, పదే పదే అదే ఆలోచనతో చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించి, పదే పదే అదే ఆలోచనతో చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రోజూ ఇదే విషయం గురించే ఆలోచించేవాడు. ఓ రోజు భార్య నిద్రపోయాక.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ మగర్రోడా గ్రామానికి చెందిన హేమ్‌లాల్ యాదవ్ (25)కు రెండేళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే నెలలు గడిచే కొద్దీ హేమ్‌లాల్ యాదవ్ ఆలోచనలో పడ్డాడు. రెండేళ్లవుతున్నా పిల్లలు పుట్టలేదనే విషయంపై రోజూ తీవ్రంగా ఆలోచించేవాడు. కొన్నాళ్లకు మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. పిల్లల విషయమై అప్పుడప్పుడూ భార్యతో గొడవపడేవాడు. అయితే రోజూ అతడు ఇదే విషయం గురించి ఆలోచించడంతో చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడూ మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. బుధవారం కూడా ఫుల్‌గా మద్యం తాగొచ్చి, భార్యతో గొడవపడ్డాడు.

ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!


అర్ధరాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయాడు. అయితే ఉదయం భార్య లేచి చూస్తే.. ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఊహించని ఈ ఘటనతో షాకైన ఆమె.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హేమ్‌లాల్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హేమ్‌లాల్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!

Updated Date - 2022-06-24T01:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising