ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ATM లో రూ.1.91 లక్షలు డిపాజిట్ చేస్తున్న యువకుడు.. సడన్‌గా ముగ్గురు కుర్రాళ్ల ఎంట్రీ.. చివరకు షాకింగ్ సీన్..!

ABN, First Publish Date - 2022-06-11T19:36:23+05:30

డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏటీఎం సెంటర్లోని డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్న ఆ యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం డబ్బులు పట్టుకుని పారిపోయారు. ఏటీఎమ్ సెంటర్‌లో ఉన్న సీసీటీవీ కెమేరాలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

10 మంది తినేది ఒక్కడే తింటాడంటూ ఫంక్షన్లకు కూడా పిలవని బంధువులు.. 200 కేజీల బరువున్న ఈ వ్యక్తికి అరుదైన రోగం..!


గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సచిన్ చౌరాసియా అనే యువకుడు జీఐడీసీ ప్రాంతంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో రూ.1.91 లక్షలు డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. సచిన్ లోపలికి వెళ్లి డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ముగ్గురు యువకులు లోపలికి ప్రవేశించారు. సచిన్ తన బ్యాగ్‌లో ఉన్న డబ్బును బయటకు తీయగానే, ఓ యువకుడు అతడికి కత్తి చూపించి బెదిరించాడు. డబ్బును తిరిగి బ్యాగ్‌లో పెట్టమని అడిగాడు. అనంతరం రూ.1.92 లక్షలు ఉన్న బ్యాగును లాక్కొని ముగ్గురూ పరారయ్యారు. 


సచిన్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ ఘటన వెనుక సచిన్‌కు తెలిసిన వారి హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-06-11T19:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising