ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వలేదని కోడలిపై మామ ఆగ్రహం.. చివరకు ఎంత పని చేశాడంటే..

ABN, First Publish Date - 2022-04-15T21:22:51+05:30

తన కోపమే తన శత్రువు అనేది పెద్దలు తరచుగా చెప్పే మాట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన కోపమే తన శత్రువు అనేది పెద్దలు తరచుగా చెప్పే మాట. చిన్న చిన్న విషయాలకు కూడా ఆగ్రహానికి గురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వలేదనే కారణంతో కోపం తెచ్చుకున్న ఓ వృద్ధుడు కోడలిపై దాష్టికానికి పాల్పడ్డాడు. చివరకు జైలు పాలయ్యాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. 


థానేకు చెందిన కాశీనాథ్‌ పాండురంగ్‌ పాటిల్‌ (76) అనే వ్యక్తికి అతని కోడలు గురువారం ఉదయం టీ ఇచ్చింది. `టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలీదా?` అంటూ కోడలిపై ఆ వ్యక్తి మాటలతో విరుచుకుపడ్డాడు. అక్కడితో శాంతించకుండా ఇంట్లో ఉన్న తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో బాధితురాలి పొట్టలోకి ఓ బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. 


కుటుంబ సభ్యులు ఆ ఘటన చూసి నివ్వెరపోయారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటోంది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాశీనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడలిపై మామ కాల్పుల వెనుక వేరే ఏమైనా కారణం ఉందా? అని అన్వేషణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-15T21:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising