ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని సరిగా చేయలేదని ఇద్దరు కాంపౌండర్లను ఉద్యోగంలో నుంచి తీసేసిన డాక్టర్.. పగతో రగిలిపోతున్న ఆ ఇద్దరు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2022-02-03T09:48:21+05:30

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనపడకుండాపోయాడు. ఆ బాలుడి తండ్రి ఒక డాక్టర్. ఆ బాలుడి కిడ్నాపర్లు మరెవరో కాదు.. ఆ డాక్టర్ వద్ద ఇంతకు ముందు పని చేసిన కాంపౌండర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనపడకుండాపోయాడు. ఆ బాలుడి తండ్రి ఒక డాక్టర్. ఆ బాలుడి కిడ్నాపర్లు మరెవరో కాదు.. ఆ డాక్టర్ వద్ద ఇంతకు ముందు పని చేసిన కాంపౌండర్లు. డాక్టర్‌పైన పగతో బాలుడిని కిడ్నాపింగ్ చేశారు. కానీ ఆ కిడ్నాపర్లు దొరికిపోతామని భయపడి బాలుడిని హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలో నివసించే డాక్టర్ ఫరీద్‌ కుమారుడు షాదాబ్(8) జనవరి 30న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఇద్దరు దుండగులు ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. పిల్లాడి కోసం ఎంత వెతికినా కనపడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసుల రెండు రోజుల తరువాత షాహిద్, నిజాం అనే ఇద్దరు యువకులపై అనుమానంతో వారిని పట్టుకున్నారు. వారిని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా.. తామే బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తరువాత హత్య చేసామని ఒప్పుకున్నారు. ఆ తరువాత పోలీసులకు షాదాబ్ శవం కూడా దొరికింది.


పోలీసుల కథనం ప్రకారం.. రెండు సంవత్సరాల క్రితం షాహిద్, నిజాం అనే ఇద్దరు యువకులు డాక్టర్ ఫరీద్ వద్ద కాంపౌడర్లుగా పనిచేసేవారు. కానీ పని సరిగాచేయకపోగా.. తప్పుడు మందులు రోగులకు ఇస్తున్నారని తెలిసి డాక్టర్ ఫరీద్ ఆ ఇద్దరినీ పనిలోనించి తీసేశారు. దీనిని అవమానంగా భావించిన ఇద్దరు యువకులు పగ తీర్చుకోవడానికి పథకం వేశారు. ముందు డాక్టర్ కుమారుడైన 8 ఏళ్ల బాలడు షాదాబ్‌ని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత మరుసటి రోజు రూ.5 లక్షలు డబ్బు అడిగాలని భావించి డాక్టర్ ఇంటి వద్దకు వెళ్లారు. కానీ అప్పటికే డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిల్లాడిని హత్య చేశారు.


ప్రస్తుతం పోలీసులు హత్య కేసులో షాహిద్, నిజాంలను అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-03T09:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising