ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5జీ టెక్నాలజీతో విమానాలకు ముప్పు!

ABN, First Publish Date - 2022-01-19T09:25:14+05:30

అమెరికాలో బుధవారం నుంచి అమల్లోకి రానున్న 5జీ సీ-బ్యాండ్‌ సర్వీసులతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోని రాడార్‌ సిగ్నళ్లకు, విమానాల్లోని రేడియో అల్టీమీటర్లకు అంతరాయం కలుగుతుందని, దీంతో ల్యాండింగ్‌ సమయంలో విమాన పైలట్లు గందరగోళానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో బుధవారం నుంచి అమల్లోకి రానున్న 5జీ సీ-బ్యాండ్‌ సర్వీసులతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోని రాడార్‌ సిగ్నళ్లకు, విమానాల్లోని రేడియో అల్టీమీటర్లకు అంతరాయం కలుగుతుందని, దీంతో ల్యాండింగ్‌ సమయంలో విమాన పైలట్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని ‘ఎయిర్‌లైన్స్‌ ఆఫ్‌ అమెరికా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ముప్పు కారణంగా కమర్షియల్‌ ఫ్లైట్‌ సర్వీసులతో పాటు, వైద్య సామగ్రి, ఇతర వస్తువులను డెలివరీ చేసే లాజిస్టిక్‌ విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెప్పింది. 


5జీ అమలును మరికొన్ని రోజులు వాయిదా వేయాలని, ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లోని దాదాపు 2 మైళ్ల పరిధిలో 5జీ సేవలను నిలిపివేయాలని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు లేఖ రాసింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా ఎయిర్‌లైన్స్‌, అలస్కా ఎయిర్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, జెట్‌ బ్లూ ఎయిర్‌వేస్‌, ఫెడ్‌ఎక్స్‌ ఎక్స్‌ప్రెస్‌, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ లేఖను రాసాయి.  

Updated Date - 2022-01-19T09:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising