ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.5 మొదలుకొని రూ.2 వేల వరకు గల నోట్లపై కనిపించే గాంధీజీ చిత్రం ఎప్పుడు తీశారంటే..

ABN, First Publish Date - 2022-02-26T13:49:43+05:30

దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసిన కృషి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ఈ నేపధ్యంలోనే దేశం ఆయనకు జాతిపిత హోదాను కల్పించింది. మహాత్ముని సాటిలేని సహకారం కారణంగా అతని చిత్రం భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రితమయ్యింది. దీనికిముందు కరెన్సీ నోట్లపై గాంధీజీకి బదులుగా ఇతర చిత్రాలు ఉండేవని మీకు తెలుసా? చాలా ఏళ్లుగా భారతీయ కరెన్సీ నోట్లపై అశోక స్తంభం, తంజావూరు దేవాలయం, గేట్‌వే ఆఫ్ ఇండియా చిత్రాలను ముద్రిస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు, బ్రిటిష్ వారు ఈ నోట్లపై కింగ్ జార్జ్ చిత్రాలను ముద్రించేవారు. 1969లో గాంధీజీ బొమ్మను తొలిసారిగా నోట్లపై ముద్రించారు. రిజర్వ్ బ్యాంక్.. మహాత్ముని జ్ఞాపకార్థం అతని చిత్రాన్ని నోట్లపై ముద్రించింది. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం చిత్రం గాంధీజీ చిత్రం వెనుక కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో గాంధీజీ తన జీవితంలో ఎంతో కీలకమైన 14 సంవత్సరాలు గడిపారు. అయితే కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీజీ నవ్వుతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు తీశారో ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీ చిత్రానికి ముందు.. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి ముందు.. బ్రిటిష్ రాజు జార్జ్ చిత్రాన్ని భారత కరెన్సీపై ముద్రించారు. 1947 సంవత్సరం వరకు ఆ విధమైన కరెన్సీ దేశంలో కొనసాగింది. బ్రిటీష్ రాజు జార్జ్ చిత్రాలు నోట్లపై ఉండకూడదని ప్రభుత్వం, సాధారణ పౌరులు కోరుకున్నప్పటికీ, దీనికి ప్రభుత్వానికి కొంత సమయం తీసుకోవాల్సివచ్చింది. ఆ తరువాత ప్రభుత్వం భారత కరెన్సీ నుంచి కింగ్ జార్జ్ చిత్రాన్ని తొలగించి, దాని స్థానంలో సారనాథ్‌లోని లయన్ క్యాపిటల్ చిత్రాన్ని ముద్రించింది. 


రిజర్వ్ బ్యాంక్ 1969లో మొదటిసారిగా గాంధీజీ చిత్రాన్ని నోట్లపై ముద్రించింది. ఆ సమయంలో గాంధీజీ చిత్రంతో కూడిన 100 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. గాంధీజీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఇది జరిగింది. గాంధీజీ సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.  గాంధీజీ చిరునవ్వులు చిందించే ఆ చిత్రాన్ని మొదటిసారిగా 1987లో కరెన్సీ నోటుపై ముద్రించారు. 1987 అక్టోబరులో గాంధీజీ చిత్రంతో కూడిన మొదటి 500 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇతర కరెన్సీ నోట్లపై కూడా గాంధీజీ చిత్రాన్ని ముద్రించారు. ఆర్బీఐ 1996 సంవత్సరంలో నోట్లలో అనేక మార్పులు చేసింది. వాటర్‌మార్క్ మార్చడంతో పాటు విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్‌లు, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు జతచేసింది. ఇప్పుడు గాంధీజీ చిత్రంతో కూడిన 5, 10, 20, 100, 500, 1000 రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. నోట్లపై ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం.. 1946లో గాంధీజీ.. మయన్మార్ (నాటి బర్మా) నుంచి ఇండియా చేరుకున్నప్పుడు తీశారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు తీశారనేదానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కాగా డీమోనిటైజేషన్ తర్వాత విడుదల చేసిన కొత్త నోట్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ చిరునవ్వుతో ఉన్న గాంధీజీ చిత్రం ఒక్కటే మిగిలి ఉంది. 

Updated Date - 2022-02-26T13:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising