ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం యువకుడి వింత ప్రకటన.. అతడికి కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన స్నేహితుడు.. యువతులకు హామీతోపాటు వెంటనే సంప్రదించాలని సూచన!

ABN, First Publish Date - 2022-06-25T16:10:11+05:30

అతడికి 27ఏళ్లు. పెళ్లి కోసం వెరైటీగా ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్లు నెటింట వైరల్‌గా మరాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ యువకుడికి అతడి స్నేహితుడు మద్దతుగా నిలిచాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 27ఏళ్లు. పెళ్లి (Marriage) కోసం వెరైటీగా ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్లు నెటింట వైరల్‌గా మరాయి. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆ యువకుడికి అతడి స్నేహితుడు మద్దతుగా నిలిచాడు. ‘మా వాడు మంచోడు అంటూ’ కండక్ట్ సర్టిఫికేట్‌ను ఇచ్చేశాడు. అంతేకాకుండా వెంటనే తన స్నేహితుడిని సంప్రదించాలని కూడా యువతులకు సూచించాడు. కాగా.. ఇంతకూ విషయం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..



జగన్ అనే యువకుడికి ప్రస్తుతం 27ఏళ్లు. Tmilanadu (తమిళనాడు)లోని మదురై ప్రాంతానికి చెందిన ఈ ఇతడు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ చేశాడు. ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ.. నెలకు రూ.40వేల జీతం పొందుతున్నాడు. కాగా.. మనసు పెళ్లి మీదకు మల్లడంతో పెళ్లీడుకు రావడంతో.. గత కొద్ది రోజుల నుంచి వివాహ ప్రయత్నాలను మొదలు పెట్టాడు. పలు మ్యారేజీ బ్యూరోలను సంప్రదించి.. తన వివరాలను అందించాడు. అయితే అక్కడ అతడికి నిరాశ ఎదురైంది. దీంతో పెళ్లి కోసం వెరైటీగా ప్రకటన ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో భాగంగానే తన వివరాలతో కూడా Posters (పోస్టర్ల)ను ముద్రింప చేసి, వాటిని వీధిల్లోని ప్రకటన బోర్డులపైకి ఎక్కించాడు. దీంతో ప్రస్తుతం ఆ పోస్టర్లు కాస్తా వైరల్‌గా మారాయి. ఇంతలో జగన్ స్నేహితుడు స్పందించాడు. ‘జగన్ చాలా మంచోడు’ అంటూ కండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఈ విషయంలో యువతులు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని హామీ కూడా ఇచ్చేశాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ ఇంత వరకూ ఏ అమ్మాయినీ కలవలేదని పేర్కొన్నాడు. యువతులు సాధ్యమైనంత త్వరగా జగన్‌ను సంప్రదించాలని సూచించాడు. 


Updated Date - 2022-06-25T16:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising