ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan యువకుడితో ప్రేమలో పడ్డ మధ్యప్రదేశ్ యువతి.. చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది.. చివరికి..

ABN, First Publish Date - 2022-06-26T21:37:52+05:30

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి.. పాకిస్థాన్‌కు చెందిన యువకుడిని ప్రేమించింది. అతడు కూడా ఈ యువతిని ఇష్టపడటంతో కొద్ది రోజులు ప్రేమాయణం సాగించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి.. పాకిస్థాన్‌కు చెందిన యువకుడిని ప్రేమించింది. అతడు కూడా ఈ  యువతిని ఇష్టపడటంతో కొద్ది రోజులు ప్రేమాయణం సాగించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. అతడ్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ బయల్దేరింది. ఈ క్రమంలో చివరికి ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతానికి చెందిన ఓ యువతి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తరుణంలోనే ఆమెకు పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా అతడితో ప్రేమాయణం సాగించిన ఆ యువతి.. పాకిస్థాన్ వెళ్లి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఈ నెల 14న ఇంట్లోంచి వెళ్లిపోయింది. అయితే.. యువతి కనిపించకుండా పోవడంతో.. ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికి.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు. అధికారులు రంగంలోకి దిగడంతో.. ప్రేమ వ్యవహారం బయటికొచ్చింది. వెంటనే లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి.. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జూన్ 25న పంజాబ్‌లోని అట్టారి సరిహద్దు వద్ద అధికారులు యువతిని గుర్తించి.. మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆమెను తిరిగి మధ్యప్రదేశ్ తీసుకొచ్చారు. కాగా.. పాకిస్థాన్ వెళ్లేందుకు యువతికి వీసా కూడా జారీ అయినట్లు విచారణలో వెల్లడైంది. 


Updated Date - 2022-06-26T21:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising