ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Painful News: అప్పటికే పెళ్లైన మహిళతో 5ఏళ్లుగా సహజీవనం.. ఐదు నెలల కిందే పెళ్లి.. ఇప్పుడు ఈ దంపతులు ఎంత పని చేశారంటే..

ABN, First Publish Date - 2022-08-07T18:07:19+05:30

ఆమెకు అప్పటికే పెళ్లైందని అతడికి తెలుసు. అయినా ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతడిపై మనసు పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఐదేళ్లపాటు సహజీవనం చేశారు. పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఈ మధ్యే 5 నెలల కిందట పెళ్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు అప్పటికే పెళ్లైందని అతడికి తెలుసు. అయినా ఇష్టపడ్డాడు. ఆమె కూడా అతడిపై మనసు పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఐదేళ్లపాటు సహజీవనం చేశారు. పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఈ మధ్యే 5 నెలల కిందట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో ఈ దంపతులు తాజాగా తీసుకున్న నిర్ణయం.. స్థానికంగా హాట్ టాపిక్ అయింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌‌కు(Madhya Pradesh) చెందిన రీనాకు కొన్నేళ్ల క్రితమే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో ప్రేమను చూపించిన భర్త.. తర్వాత ఆమెను హింసించాడు. రోజూ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆ బాధలు భరించలేకపోయిన రీనా.. అతడిని వదిలేసింది. ఈ క్రమంలోనే రీనాకు దీపక్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఈ పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడి.. దీపక్ తల్లి అంగీకారంతో ఇద్దరూ ఇండోర్‌లో సహజీవనాన్ని ప్రారంభించారు. ఐదేళ్లపాటు లివింగ్ రిలేషన్‌(living relationship)లో ఉన్న రీనా, దీపక్.. పిల్లలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో 5నెలల కిందటే వివాహ(Marriage) బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. అనూహ్యంగా ఈ దంపతులు ఇద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. 



విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(Police).. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీపక్ తల్లి మాట్లాడుతూ.. పెళ్లైన తర్వాత దీపక్, రీనాల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో తరచూ గొడవలు పడేవారని తెలిపింది. ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయారని వెల్లడించింది.అంతేకాకుండా వేరు కాపురం కోసం రీనా పట్టుబట్టిందని.. దానికి దీపక్ ఒప్పుకోలేదని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ..తొలుత రీనా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలి ఉంటుందని.. ఆమె మరణించిన విషయం తెలిసి దీపక్ ఉరేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2022-08-07T18:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising