ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌తో కంటే విద్యుత్‌తో ఆహారం వండడం చాలా చౌక.. ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..

ABN, First Publish Date - 2022-02-19T16:53:18+05:30

తరచూ గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరచూ గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో అది వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. ఫలితంగా చాలామంది వంట వండేందుకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ స్టవ్‌లను ఆశ్రయిస్తున్నారు. పైగా ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట వండితే డబ్బు ఆదా అవుతున్నదని కూడా చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేయడం బెటరా? లేదా గ్యాస్ స్టవ్ పై వంట చేయడం బెటరా? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ స్టాండర్డ్ తెలిపిన వివరాల ప్రకారం దేశరాజధాని ఢిల్లీలో ఎల్‌పిజి గ్యాస్ ధర.. విద్యుత్ ధరను మించిపోయింది. ఫలితంగా ఎల్పీజీపై వంట చేయడం కంటే ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేస్తే తక్కువ ఖర్చవుతున్నదని వెల్లడయ్యింది. 


బిజినెస్ స్టాండర్డ్  అందించిన నివేదిక ప్రకారం ఎల్‌పిజి గ్యాస్ సాయంతో 10 లీటర్ల నీటిని మరిగించడానికి రూ.10.15 ఖర్చవుతుంది. అదే సమయంలో విద్యుత్ స్టవ్‌తో ఇంత నీటిని అదే ఉష్ణోగ్రతకు వేడి చేస్తే రూ.9.46 మాత్రమే ఖర్చవుతుంది. అంతే నీటిని ఇండక్షన్ స్టవ్‌పై వేడిచేస్తే రూ.8.33 మాత్రమే ఖర్చవుతుంది. కేవలం 10 లీటర్ల నీటిని మరిగించడంలో ఈ రెండు ఇంధనాల్లో ఎంత తేడా వచ్చిందో అర్థమయ్యే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఇండక్షన్ స్టవ్‌పై వంట వండితే ఎంత ఆదా అవుతుందో గ్రహించగలుగుతారు. ఉదాహరణకు ఒక నగరంలో విద్యుత్ యూనిట్‌కు 8 రూపాయల ధర ఉంటే ఆ నగరంలో LPG సిలిండర్‌తో వంట చేయడం ఖరీదైన వ్యవహారంగా గుర్తించవచ్చు. అయితే ఒక్కో రాష్ట్రంలోని విద్యత్ ధరలను ధరలను బట్టి ఏది ఎక్కువ? ఏది తక్కువ అనేది గ్రహించవచ్చు.

Updated Date - 2022-02-19T16:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising