ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్బో.. ఎంత ఘాటు ప్రేమో.. ప్రేయసి కోసం ఊరు మొత్తాన్నే చీకటి చేశాడు!

ABN, First Publish Date - 2022-05-24T01:53:08+05:30

ప్రేమ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి చాలా మంది వెనుకాడరు. కొంతమంది ప్రియురాలిపై దాడులు చేస్తే.. మరికొందరు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటారు. కానీ బీహార్‌కు చెందిన ఓ ఎలక్ట్రీషియన్‌ తన ప్రే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి చాలా మంది వెనుకాడరు. కొంతమంది ప్రియురాలిపై దాడులు చేస్తే.. మరికొందరు ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటారు. కానీ బీహార్‌కు చెందిన ఓ ఎలక్ట్రీషియన్‌ తన ప్రేయసి కోసం ఊరు మొత్తాన్ని చీకటి చేసేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పూర్నియా జిల్లాలోని గణేష్ పూర్ గ్రామంలో గత కొన్ని రోజులు సాయంత్రమవగానే రెండు మూడు గంటలపాటు కరెంట్ పోతోంది. కానీ పక్క గ్రామాల్లో కరెంట్ నిరంతరాయంగా ఉండడాన్ని స్థానికులు గమనించారు. తమ గ్రామంలోనే కరెంట్ ఎందుకు పోతోందని ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రీషియన్‌పై నిఘా పెట్టారు. దీంతో అసలు నిజం బయటపడింది. తన ప్రేయసిని రహస్యంగా కలిసేందుకు ఎలక్ట్రీషియన్ కరెంట్ కట్ చేస్తున్నాడని తెలుసుకున్నారు. దీంతో ఆ ప్రేమ జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు గ్రామస్తులు. పగటి పూట ప్రేయసిని కలవడం కుదరకపోవడం వల్లే ప్రతీ రోజు సాయంత్రం కరెంట్ కట్ చేస్తున్నట్టు తెలిపాడు. కరెంట్ తీస్తున్నాడనే కోపంతో ఎలక్ట్రీషియన్‌పై దాడి చేసిన గ్రామస్తులు.. ఆ తర్వాత ఇరువురి ఇష్టంతో సర్పంచ్ ఆధ్వర్యంలో పెళ్లి చేశారు.




Updated Date - 2022-05-24T01:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising