ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పెళ్లిపై పెద్దల అరాచకం: యువకుని ఇంటిపై దాడి చేయడంతోపాటు..

ABN, First Publish Date - 2022-01-16T15:05:49+05:30

మధ్యప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా రాయ్‌పూర్ పట్టణంలో ప్రేమ పెళ్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. అమ్మాయి తరఫువారు అబ్బాయి ఇంటిపై దాడి చేసి, అతని కుటుంబ సభ్యులను చావబాదారు. ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ దాడిలో ఓ మహిళతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం బాధితులను ఝలావర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. 


ఈ కేసులో 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరినీ జైలుకు తరలించారు. రాయ్‌పూర్ పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు వివాహం చేసుకున్నట్లు రాయ్‌పూర్ పోలీసు అధికారి రాజ్‌పాల్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ భవానీమండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు యువకుని కుటుంబంపై దాడి చేసి, వారి ఇంటిని తగులబెట్టారు. ఈ దాడిలో ఆ యువకుని కుటుంబానికి చెందిన ఒక మహిళతో సహా నలుగురు గాయపడ్డారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని ఝలావర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాయ్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబీకులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల పనితీరు సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని బాధిత కుటుంబీకులు ఆరిపిస్తున్నారు.

Updated Date - 2022-01-16T15:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising