ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గ్రామంలో విదేశాలకు వెళ్లేందుకు జీరో పర్సెంట్ రుణం.. మరో సౌలభ్యం కూడా..

ABN, First Publish Date - 2022-03-12T18:00:23+05:30

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం మధ్య వేలాది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం మధ్య వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నేపధ్యంలో ఆపరేషన్ గంగా కింద భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌తో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. గత ఏడాది జూలైలో విదేశాంగ మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 11 లక్షల 33 వేల 749 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. దేశంలోని లక్షలాది మంది విదేశాలకు వెళ్లాలని, చదువుకోవాలని, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా చాలామందికి తమ కలలు నెరవేరవు. 


అయితే గుజరాత్‌లోని ఒక ప్రాంతంలోనివారు విదేశాలకు వెళ్లాలనుకునేవారి కలను నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తారు. గుజరాత్‌లో డోలారియో ప్రదేశ్ అనే ప్రాంతం ఉంది. విదేశాల్లో స్థిరపడిన యువతకు ఆర్థికంగా సహాయం చేసే ట్రస్టులు ఇక్కడ చాలా ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకుని స్థిరపడాలనుకుంటున్న యువతీ యువకులకు ఈ సంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ ట్రస్ట్‌లను స్థానిక సంఘాలు నిర్వహిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం విదేశాలకు వలస వెళ్లాలనుకునే వారు డోలారియోలోని ట్రస్ట్ ద్వారా సున్నా శాతం (0%) వడ్డీకి లక్షల రూపాయల రుణాలు అందుకోవచ్చు. ఇంతేకాదు ట్రస్ట్ నిర్వాహకులు రుణగ్రహీతను డబ్బును తిరిగి ఇవ్వాలని ఎప్పుడూ ఒత్తిడి చేయరు. గాంధీనగర్ జిల్లాలోని కలోల్ పట్టణానికి చెందిన 21 ఏళ్ల అంకిత్ పటేల్‌కు ఇలాంటి సహాయం లభించింది. అమెరికా వెళ్లాలనుకున్నా బ్యాంకులో అప్పు తీసుకునేంత ఆర్థిక స్తోమత అతనికి లేదు. అటువంటి పరిస్థితిలో అంకిత్ స్థానిక ట్రస్ట్‌ను సంప్రదించారు. ట్రస్ట్ తరపున సంఘం నుంచి డబ్బులు జమ చేసి.. వారం రోజుల్లో అతనికి సాయం అందించారు. ఈ విధంగా అంకిత్ విదేశాలకు వెళ్లాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో స్థిరపడిన అంకిత్.. తన సంపాదనతో రుణ మొత్తాన్ని ట్రస్టుకు తిరిగి ఇవ్వడమే కాకుండా, అంతే మొత్తంలో డబ్బు అదనంగా ఇచ్చాడు. అంటే అప్పుగా తీసుకున్న మొత్తానికి రెండింతలు తిరిగిచ్చాడు. కాగా ట్రస్ట్ ఎవరి నుండి డబ్బు డిమాండ్ చేయదు. ఈ ప్రాంతానికి చెందిన వారిలో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు.. అమెరికా, కెనడా లేదా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారని స్థానికులు తెలిపారు.




Updated Date - 2022-03-12T18:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising