ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video:ఈ చిన్నారి వయస్సు ఐదేళ్లకంటే తక్కవే.. అయినా అదరగొట్టేసింది..

ABN, First Publish Date - 2022-08-12T21:47:33+05:30

ముద్దు పలుకులు, చిట్టి చిట్టి పనులతో చిన్న పిల్లలు(Childern) ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. అమాయకంగా ముఖం పెట్టి.. వాళ్లు చేసే పనులను చూస్తే నవ్వు రాక మానదు. ఎంత కోపంలో ఉన్న వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ముద్దు పలుకులు, చిట్టి చిట్టి పనులతో చిన్న పిల్లలు(Childern) ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. అమాయకంగా ముఖం పెట్టి.. వాళ్లు చేసే పనులను చూస్తే నవ్వు రాక మానదు. ఎంత కోపంలో ఉన్న వారినైనా.. పిల్లలు తమ చేష్టలతో ఇట్టే కూల్ చేసేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. దానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నారితో సహా తన మాస్టర్‌పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ చిన్నారి ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఓ చిన్నారి( little girl).. పింక్ కలర్‌ కరాటే డ్రెస్ ధరించి.. అదరగొట్టింది. కఠినమైన కరాటే టెక్నిక్స్ ఈజీగా నేర్చేసుకుంది. అంతేకాకుండా తన మాస్టర్‌తో కలిసి ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్‌లో ఒక ప్రొఫెషనల్ కరాటే(karate)మాస్టర్‌‌లా ఆ చిన్నారి పర్‌ఫార్మ్ చేసింది. ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియా(Social Meida)లో ఆగస్ట్ 9న పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది వీక్షించగా.. సుమారు 70 వేల మంది లైక్ చేశారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు.. ఆ చిన్నారితోపాటు శిక్షణ ఇస్తున్న కారాటే మాస్టర్‌ను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-08-12T21:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising