ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Essay on Mother: తల్లి గురించి బాలుడు రాసిన వ్యాసం వైరల్.. ఫుల్ మార్కులు ఇస్తున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-08-20T21:57:21+05:30

కొడుకు తన గురించి రాసిన వ్యాసం చూసి ఆ తల్లి మురిసిపోయింది. దానిని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకు తన గురించి రాసిన వ్యాసం చూసి ఆ తల్లి మురిసిపోయింది. దానిని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలుడికి స్కూల్లో వ్యాస రచన పోటీ జరిగింది. `మీరు ఎంతగానో ఆరాధించే వ్యక్తి గురించి వ్యాసం రాయండి` అని అడిగారు. దానికి ఆ బాలుడి రాసిన సమాధానం (Essay on Mother) అందిరినీ ఆకట్టుకుంటోంది. 


`నాకు మా అమ్మ ఎంటే ఎంతో అభిమానం. ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలని, వీలైనంత సహాయం చేయాలని నాకు నేర్పినది అమ్మ కాబట్టి నేను ఆమెను అభిమానిస్తున్నాను. ఆమె చాలా సరదాగా ఉంటూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. ఆమె చాలా బాగా వంట చేయగలదు. ఆమె నాకు ఎలా నడవాలో నేర్పింది. నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. ఆమె ఇంట్లో పని చేసుకుంటూనే నన్ను చూసుకుంటుంది. రోజుకు రెండు గంటలు చదివిస్తుంది. వారానికి రెండు సార్లు స్విమ్మింగ్‌కి తీసుకెళ్తుంది. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమమైనద`ని ఆ బాలుడు రాశాడు. 


ఆ వ్యాసాన్ని ఆ తల్లి ట్విటర్‌లో షేర్ చేసి..`నాకు ఏడుపు వస్తోంద`ని కామెంట్ చేసింది. ఈ వ్యాసం రాసిన బాలుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నాడని పొగుడుతున్నారు. ఆ బాలుడికి ఫుల్ మార్కులు వేయాలని కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-20T21:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising