ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సింహం భయపడటం ఎప్పుడైనా చూశారా.. అడవి దున్నల దెబ్బకు పాపం ఇలా..!

ABN, First Publish Date - 2022-03-12T22:07:23+05:30

సింహాన్ని అడవికి రాజుగా అభివర్ణిస్తారు. అడవిలోని ఇతర జంతువులు దాన్ని చూసి హడలిపోతాయని చెబుతారు. సింహం సమీపిస్తుదంటే జంతువులన్నీ పరారైపోతాయని అంటారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సింహాన్ని అడవికి రాజుగా అభివర్ణిస్తారు. అడవిలోని ఇతర జంతువులు దాన్ని చూసి హడలిపోతాయని చెబుతారు. సింహం సమీపిస్తుదంటే జంతువులన్నీ పరారైపోతాయని అంటారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మృగరాజుగా కీర్తించబడే సింహమే ప్రాణభయంతో గజగజా వణికిపోయింది. బిక్కబిక్కుమంటూ చెట్టెక్కేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



సినిమాల్లో డైలాగ్‌లు ఎలా ఉన్నప్పటికీ కొన్ని అరుదైన సందర్భాల్లు మినహా సింహాలు సింగిల్ వేటకు వెళ్లవు. ఈ క్రమంలోనే ఒంటరిగా బయటికొచ్చిన ఓ సింహం.. పదుల సంఖ్యలో ఉన్న అడవి దున్నల బారిన పడింది. గుంపుగా అవి సమీపించడంతో గజగజా వణికిపోయింది. వాటి చేతికి చిక్కితే తన పనైపోతుందని భావించి.. దగ్గర్లో ఉన్న చెట్టును ఎక్కేసింది. కొన్ని అడుగుల వరకూ వెళ్లి.. అక్కడే ఉండిపోయింది. ఈ దృశ్యాలు ఎవరి కెమెరాకు చిక్కాయన్న విషయం మాత్రం తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వారిలో కొందరు స్పందిస్తూ.. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి అనే సుమతి శతకం సింహానికి గుర్తొచ్చి.. ప్రాణాలను రక్షించుకునేందుకు ఇలా చేసి ఉంటుందని’ అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.






Updated Date - 2022-03-12T22:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising