ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 మంది అధికారులను 4రోజులు ముప్పుతిప్పలు పెట్టిన చిరుత

ABN, First Publish Date - 2022-01-28T02:49:42+05:30

నాలుగు రోజులుగా తమిళనాడులోని తిప్పూర్ ప్రాంత వాసులను భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతపులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు బంధించారు. అంతేకాకుండా చిరుతపులి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: నాలుగు రోజులుగా తమిళనాడులోని తిప్పూర్ ప్రాంత వాసులను భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతపులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు బంధించారు. అంతేకాకుండా చిరుతపులి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



నాలుగు రోజుల క్రితం తిప్పూర్ ప్రాంతంలోకి వచ్చిన చిరుత.. 60ఏళ్ల రైతుపై తొలుత దాడి చేసింది. చిరుత నుంచి ఆ రైతును రక్షించేందుకు ప్రయత్నించిన మరోరైతుపై కూడా అది దాడికి తెగబదింది. దీంతో తీవ్రభయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 50మంది అధికారులు తిర్పూర్ చేరుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ.. దాని ప్రతి కదలికనూ పరిశీలించారు. చిరుత బారినపడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అటవీ అధికారులు గురువారం దాన్ని బంధించారు. ఈ సందర్భంగా చిరుతకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిరుతకు వైద్య పరీక్షలు జరిపిన తర్వాత దాన్ని అటవిలో వదిలేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. చిరుతను బంధించే క్రమంలో ఐదుగురు ఫారెస్ట్ అధికారులు కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. 






Updated Date - 2022-01-28T02:49:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising