ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావోద్వేగంతో డ్రైవర్‌ని కారులో ఇంటికి దిగబెట్టిన డాక్టర్... ఇలా ఎందుకు చేశారో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-07-30T17:40:46+05:30

రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన సిఎంహెచ్‌ఓ డ్రైవర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన సిఎంహెచ్‌ఓ డ్రైవర్ పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ సందర్భంగా సిఎంహెచ్‌ఓ డాక్టర్ అజయ్ చౌదరి ఆ రిటైర్డ్ డ్రైవర్ మహావీర్‌కు డ్రైవర్‌గా మారారు. మహావీర్‌ను, అతని కుటుంబాన్ని వారి ఇంటి దగ్గర దిగబెట్టారు. డ్రైవర్ మహావీర్ ఎప్పుడూ నీడలా తన వెంట ఉండేవాడని సీఎంహెచ్‌ఓ వైద్యుడు అజయ్ చౌదరి తెలిపారు.



డ్రైవర్ మహావీర్ ప్రసాద్ సైనీ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పదవీ విరమణ చేసే వరకు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ చౌదరి దగ్గర డ్రైవర్‌గా ఉన్నాడు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో 1988 నుండి ఇప్పటి వరకు డ్రైవర్‌గా పనిచేశాడు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ అజయ్ చౌదరి డ్రైవర్ పదవీ విరమణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మహావీర్‌ తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భవనంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-07-30T17:40:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising