ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో జాబ్.. రూ.20 లక్షల జీతం.. అన్నీ వదులుకుని వ్యవసాయం ప్రారంభించిన అతని సంపాదన ఎంతంటే..

ABN, First Publish Date - 2022-03-04T18:31:15+05:30

అతను పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసి ఓ జపాన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు.. సింగపూర్‌లో ఉద్యోగం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసి ఓ జపాన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు.. సింగపూర్‌లో ఉద్యోగం.. నెలకు రూ.20 లక్షల జీతం.. నాలుగేళ్లు పని చేసిన తర్వాత అతని మనసు వ్యవసాయం మీదకు మళ్లింది.. స్వగ్రామానికి వెళ్లిపోయి వ్యవసాయం చేయాలనుకున్నాడు.. అనుకున్నదే తడవుగా జాబ్‌కు రాజీనామా చేసి ఊరు వెళ్లిపోయాడు.. వ్యవసాయంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి టర్నోవర్ సాధిస్తున్నాడు. 


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని దుదు గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం సింగపూర్‌ నుంచి వచ్చి వ్యవసాయం ప్రారంభించాడు. వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తూ వర్షపు నీటితో ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టాడు. వర్షపు నీటిని నిలువ ఉంచే ట్యాంకులను నిర్మించి వాటితో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి వాటిల్లో గుమ్మడికాయలు, ఇటాలియన్ బెజెల్, దోసకాయలు, క్యాప్సికమ్ వంటివి పండించడం ప్రారంభించాడు. 


వీదేశీ కూరగాయలను పండిస్తూ వాటిని ఢిల్లీ, జైపూర్, ముంబై వంటి నగరాల్లో విక్రయిస్తుంటాడు. ఈ మేరకు ఆయా నగరాల్లోని స్టార్ హోటళ్లతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. కొన్ని రకాల కూరగాయలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటాడు. ఇలా ఏడాదికి రూ.కోటి రూపాయలు పైనే సంపాదిస్తున్నాడు. పరిసర ప్రాంతాల్లోని భూములను లీజుకు తీసుకుంటూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాడు. స్థానిక యువకులకు ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. 

Updated Date - 2022-03-04T18:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising