ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SuperStarKrishna: కృష్ణ గారి ఆస్తి పంపకాలు ఎలా అంటే

ABN, First Publish Date - 2022-11-22T15:11:58+05:30

అందువల్ల విజయనిర్మల గారి ఆస్తి చాల మటుకు కృష్ణ గారికి చెందుతుంది అని, ఏవేవో చెపుతూ, కృష్ణ గారికి కూడా చాలా ఆస్తి వచ్చిందని, అది అతని మనవలు పేరా రాసేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

File photo of Krishna and Mahesh Babu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈమధ్య చాలా సాంఘీక మాధ్యమాల్లో కృష్ణ గారి ఆస్తి గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కృష్ణ గారు కొన్ని రోజుల క్రితం గుండెపోటు తో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణగారు తన రెండో భార్య విజయనిర్మల చనిపోయిన తరువాత నరేష్ ఇంట్లోనే మరణించే వరకు వున్నారు. అందువల్ల విజయనిర్మల గారి ఆస్తి చాల మటుకు కృష్ణ గారికి చెందుతుంది అని, ఏవేవో చెపుతూ, కృష్ణ గారికి కూడా చాలా ఆస్తి వచ్చిందని, అది అతని మనవలు పేరా రాసేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ విషయం ఏంటి అంటే, కృష్ణగారు పద్మాలయ స్టూడియోస్ మీద సినిమాలు, అలాగే విజయనిర్మల గారు విజయ కృష్ణ బ్యానర్ మీద సినిమాలు తీశారు. అందులో వచ్చిన లాభాలు, నష్టాలు ఎవరికీ వారివే. అదీ కాకుండా విజయనిర్మల హైదరాబాద్ లో చాలా ఆస్తులు కొన్నారు, సంపాదించారు. ఆమె ఆస్తి లో కృష్ణ గారికి ఏమి వాటా ఉండదు. ఇప్పుడు వున్న నరేష్ ఇల్లు అది అతని సొంతం, అంతే కానీ అది కృష్ణ గారికి చెందదు. అలాగే విజయనిర్మల గారు చనిపోయే ముందు కొంత ఆస్తి ఆమె మనవడు నవీన్ విజయ కృష్ణ పేరు మీద రాసారు. ఆమెకి నవీన్ విజయ కృష్ణ అంటే ఎంతో ఇష్టం కనుక. నవీన్ విజయ కృష్ణ నరేష్ మొదటి భార్య కొడుకు.

ఇక పోతే, కృష్ణ గారికి విజయనిర్మల వలన ఎదో ఆస్తి వచ్చేసింది అని, అది అతని మనవళ్ల పేరు మీద రాసేశారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా అబద్దం. ఇందులో నిజం లేదు. కృష్ణ గారి కి పద్మాలయ స్టూడియో వుంది, అతని తదనంతరం కుమారులకు వస్తుంది. అంతే. అదీ కాకుండా, రమేష్ బాబు కుటుంబం కూడా బాగానే సెటిల్ అయ్యారని తెలిసింది. మహేష్ బాబు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరుగా వున్నాడు కాబట్టి, అతనికి ఏమి కొదవ లేదు. బాగానే వున్నాడు. ఎవరి దగ్గర వున్న ఆస్తి వారిదే, అంతే కానీ నరేష్ దగ్గర నుండి మహేష్ కి ఏమి రాదు, అలాగే ఇక్కడ నుండి అక్కడికి కూడా. "నరేష్ వున్న ఇల్లు అతనిదే. కృష్ణగారికి అక్కడ నుండి ఏమి రాదు. అతను సంపాదించింది అంత పద్మాలయ స్టూడియోస్ పైన పెట్టుబడి పెట్టింది, అది అతని కుమారులకు వస్తుంది. విజయనిర్మల గారు విజయకృష్ణ మూవీస్ మీద సినిమాలు నిర్మించారు, అవి ఆమె సొంతం. ఆమె కూడా చాలా భూమి ఆస్తి కొన్నారు, అది ఆమె సొంతం, తదనంతరం కుమారుడికి వెళుతుంది, అంతే, ఇందులో తగాదాలు ఏమున్నాయి, అంత క్లియర్," అని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. (#SuperstarKrishna #MaheshBabu #KrishnaProperty #KrishnaLivesOn)

Updated Date - 2022-11-22T15:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising