ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మగువల అందానికి మెరుగులు దిద్దే లిప్‌స్టిక్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా?

ABN, First Publish Date - 2022-01-20T16:57:58+05:30

మగువలు మేకప్ వేసుకున్నప్పుడల్లా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మగువలు మేకప్ వేసుకున్నప్పుడల్లా లిప్‌స్టిక్‌ను టచ్ చేయకుండా ఉండరు. అమ్మాయిల బ్యాగ్‌లో లిప్‌స్టిక్‌ తప్పనిసరిగా ఉంటుంది. అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేసే లిప్‌స్టిక్‌ను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి, మైనం, నూనె, పిగ్మెంట్లు, సువాసన, గ్లోస్ మొదలైన వాటిని ఉపయోగిస్తారు. దీనితో పాటు, లిప్‌స్టిక్ దీర్ఘకాలం ఉండేందుకు ప్రిజర్వేటివ్‌లు, ఆల్కహాల్ మొదలైనవి కూడా ఉపయోగిస్తారు. ఇవేకాకుండా కొన్ని కంపెనీలు ఇతర పదార్థాలను కూడా కలుపుతాయి. లిప్‌స్టిక్‌ తయారీ విధానం గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. 


లిప్‌స్టిక్ తయారీలో ముఖ్యమైనది పిగ్మెంట్ల మిక్సింగ్. వర్ణద్రవ్యాలను కలపడం ద్వారా అనేక రంగులు, షేడ్స్ తయారవుతాయి. లిప్‌స్టిక్ తయారీకి మొదటి వర్ణద్రవ్యం ఎంపిక చేస్తారు. నూనెతో వర్ణద్రవ్యం మిశ్రమం నిర్థారిత నిష్పత్తిలో ఉంటుంది. ఆ తరువాత మైనాన్ని కలిపే ప్రక్రియ ఆవిరి జాకెట్ కెటిల్ ద్వారా జరుగుతుంది. దీనితో లిప్‌స్టిక్‌కి ఒక రకమైన మృదుత్వం వస్తుంది. తరువాత ఇతర పదార్థాలను కూడా దీనిలో కలుపుతారు. ఈ ప్రక్రియను మౌల్డింగ్ అంటారు. ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది. అనంతరం దానిని చల్లబరుస్తారు. ఆ మిశ్రమంలో గాలి ఇంకా మిగిలిపోతే, ఆ గాలిని యంత్రాల ద్వారా తొలగిస్తారు. దీనిని శీతలీకరణ చేశాక అచ్చుల నుంచి విడదీస్తారు. ఈ విధంగా లిప్‌స్టిక్ తయారవుతుంది. దానిని ప్యాక్‌చేసి మార్కెట్‌లో విక్రయానికి ఉంచుతారు.

Updated Date - 2022-01-20T16:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising