ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్యూషన్‌కు వెళ్లిన బాలిక హత్య.. మారువేషాలలో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. చివరకు ఎలా పట్టుబడ్డాడంటే..

ABN, First Publish Date - 2022-03-10T05:51:47+05:30

రాజస్థాన్‌లోని కోట నగరంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 13న మైనర్ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. ఆ మైనర్ బాలికను స్వయంగా ట్యూషన్ టీచర్ హత్య చేశాడు. హత్య తర్వాత నిందితుడు రకరకాల వేషధారణల్లో పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని కోట నగరంలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 13న మైనర్ బాలిక అత్యాచారం, హత్యకు గురైంది. ఆ మైనర్ బాలికను స్వయంగా ట్యూషన్ టీచర్ హత్య చేశాడు. హత్య తర్వాత  నిందితుడు రకరకాల వేషధారణల్లో పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు. నిందితుడిని పట్టుకునేందుకు కోట పోలీసులు 30 బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు పట్టుకున్నారు.



కోట నగరంలో ఉపాధ్యాయుడిగా పని చేసే గౌరవ్ జైన్‌ను అనే వ్యక్తి తన వద్ద చదువుకునే విద్యార్థినిని ఇంట్టో ట్యూషన్‌కు పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించడంతో భయపడి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పట్టుబడిపోతానేమోనని ఇల్లు వదిలి పారిపోయాడు.


రాజస్థాన్‌లో పారిపోయి నేరుగా ఉత్తరాఖండ్ వెళ్లాడు. ఉత్తరాఖండ్, బీహార్‌లలో అమ్మాయి వేషధారణలో తిరిగాడు. రాత్రి సమయాల్లో బస్టాండ్‌లో గడిపేవాడు. నిందితుడిని పట్టుకునేందుకు కోట పోలీసులు రాజస్థాన్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో వెతకడం ప్రారంభించారు. ఫోన్ లొకేషన్, సీసీటీవి వీడియోల ఆధారంగా ఎట్టకేలకు నిందితుడని యూపీలో పోలీసులు పట్టుకున్నారు.


నిందితుడు గౌరవ్ జైన్‌ని కోర్టులో హాజరుపరిచి 6 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. 




Updated Date - 2022-03-10T05:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising