ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.300 కోసం స్నేహితుల మధ్య గొడవ.. ఆ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీసిందంటే..

ABN, First Publish Date - 2022-03-11T22:38:33+05:30

అతను ఓ వ్యాపారవేత్త కొడుకు.. ఉద్యోగం, వ్యాపారం చేయకుండా స్నేహితులతో జల్సాగా తిరిగేవాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతను ఓ వ్యాపారవేత్త కొడుకు.. ఉద్యోగం, వ్యాపారం చేయకుండా స్నేహితులతో జల్సాగా తిరిగేవాడు.. వారితో కలిసి మద్యం సేవించేవాడు.. అనంతరం గొడవలకు దిగేవాడు.. ఈ క్రమంలో ఈ నెల రెండో తేదీన హత్యకు గురయ్యాడు.. స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నంచగా షాకింగ్ విషయం తెలిసింది.. రూ.300 కోసం స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలో అతను చనిపోయాడని తేలింది. 


మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌‌కు చెందిన వ్యాపారవేత్త మల్కన్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు రాహుల్ ఈ నెల రెండో తేదీన హత్యకు గురయ్యాడు. తర్వాతి రోజు అతని మృతదేహం రోడ్డు పక్కన తుప్పల్లో లభ్యమైంది. అతడి శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు రాహుల్ స్నేహితుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సునీల్ పలుసార్లు మాటలు మార్చాడు. 


అతడిని అనుమానించిన పోలీసుల తనదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈ నెల రెండో తేదీన తాను, రాహుల్, విజయ్ రజక్, శంకర్ మద్యం సేవించామని చెప్పాడు. తాము తీసుకెళ్లిన మందు అయిపోవడంతో ఇంకా తీసుకోవడానికి రాహుల్‌ను డబ్బులు అడిగామని, అతను లేవు అన్నాడని చెప్పాడు. క్రమంగా ఆ గొడవ పెరగడంతో రాహుల్‌‌ను కత్తితో పొడిచి చంపేశామని చెప్పాడు. దీంతో పోలీసులు సునీల్‌తో పాటు మిగిలిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-03-11T22:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising