ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడో తరగతి మానేసిన ఆ కుర్రాడు చేయని పనిలేదు... చికెన్ విక్రయించడం మొదలు పెట్టి... కేఎఫ్‌సీ విజయం ప్రస్థానం

ABN, First Publish Date - 2022-11-29T11:09:58+05:30

ఎవరికైనా వైఫల్యం ఎదురైతే ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి నిలబడేందుకు సమయం పడుతుంది. అయితే KFC వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్‌కు ఎదురైన వైఫల్యాల గురించి తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరికైనా వైఫల్యం ఎదురైతే ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి నిలబడేందుకు సమయం పడుతుంది. అయితే KFC వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్‌కు ఎదురైన వైఫల్యాల గురించి తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు. పదవీ విరమణ చేసి, విశ్రాంతి తీసుకోవాలని భావించే వయస్సులో సాండర్స్ KFCని ప్రారంభించారు. KFC అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. కల్నల్ సాండర్స్ బాల్యమంతా పేదరికంలో గడిచింది. 7వ తరగతి తర్వాత చదువును వదిలేయాల్సి వచ్చింది. రకరకాల పనులు చేయాల్సి వచ్చింది. సైన్యంలో చేరినా, కొద్ది రోజులకే అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆ తర్వాత రైల్వేలో చేరాడు. ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా ఆ ఉద్యోగాన్నీ వదిలేశారు. బీమా పాలసీలు చేయించడం, క్రెడిట్ కార్డులు విక్రయించడం, టైర్లు అమ్మడం లాంటి పనులు కూడా చేశాడు. ఎక్కడా అతనికి విజయం దక్కలేదు. 1930లో కెంటుకీలోని కార్బిన్‌లో అతను గ్యాస్ స్టేషన్‌ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో ప్రయాణీకులు ఒక రెస్టారెంట్ తెరవమని ఆయనను కోరారు. దీంతో అతను స్పెషల్ రిసిపి చికెన్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. 1950లో ఒకసారి కెంటకీ గవర్నర్ అక్కడికి చేరుకుని చికెన్ రుచి చూశారు. అది అతనికి ఎంతో నచ్చింది. సంతోషంతో అతను హార్లాండ్ సాండర్స్‌కు కల్నల్ బిరుదును ఇచ్చాడు.

అప్పటి నుండి హార్లాండ్ కల్నల్ సాండర్స్ అయ్యాడు. KFC లోగోలో కనిపించే చిత్రం కల్నల్ సాండర్స్‌దే. కొన్ని కారణాలతో అతను రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చింది. దీంతో అతను తన చికెన్‌ని ఇతర రెస్టారెంట్లలో విక్రయించాలని అనుకున్నాడు. చాలా రెస్టారెంట్‌లకు వెళ్లి దీని గురించి చెప్పేవాడు. 1008 రెస్టారెంట్ల నుండి నో విన్న తర్వాత, 1009వ రెస్టారెంట్ అతనికి అనుమతినిచ్చింది. దీని తర్వాత KFC హవా స్టార్ట్ అయింది. కొంతకాలం తరువాత తన ఫ్రాంచైజీని అమ్మేశాడు. ఈ కంపెనీ రేనాల్డ్స్, పెప్సికోతో సహా అనేక చేతుల్లోకి వెళ్లింది. KFC ఇండియా జనరల్ మేనేజర్ మోక్ష్ చోప్రా దేశంలోని ప్రధాన నగరాల్లో KFC స్మార్ట్ రెస్టారెంట్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. చెన్నైలోని పెరంబూర్‌లో కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ను రైల్వే కోచ్‌లా తీర్చిదిద్దారు.

Updated Date - 2022-11-29T11:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising