ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరే కులం అమ్మాయిని ప్రేమించిన యువకుడు.. అతడి ప్రేమను అంగీకరించని యువతి కుటుంబం.. ఒకరోజు ఆ యువకుడు చెట్టకు వేలాడుతూ.. నిజానికి ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-13T05:44:13+05:30

చదువుకునే వయసులో ఓ యువకుడు ప్రేమించాడు. వేరే కులానికి చెందిన వాడిని అమ్మాయి తల్లిదండ్రులు అతడితో సంబంధానికి ఒప్పుకోలేదు. ఒకరోజు రాత్రి అతడు కాలేజీ హాస్టల్ నుంచి బయటివెళ్లాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చదువుకునే వయసులో ఓ యువకుడు ప్రేమించాడు. వేరే కులానికి చెందిన వాడిని అమ్మాయి తల్లిదండ్రులు అతడితో సంబంధానికి ఒప్పుకోలేదు. ఒకరోజు రాత్రి అతడు కాలేజీ హాస్టల్ నుంచి బయటివెళ్లాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ తిరిగిరాలేదు. మరుసటి రోజు ఉదయం హాస్టల్ సమీపంలో ఓ చెట్టుకు వేలాడుతూ అతని మృతదేహం కనిపించింది. అది ఆత్మహత్యగా అందరూ భావించారు. కానీ అతిన తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేశారు. ఆ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిర్ జిల్లాకు చెందిన మంజునాథ్ పుజారి(18) అనే యువకుడు తనతో కాలేజీలో చదువుకునే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో చెప్పాడు. కానీ మంజునాథ్ వేరే కులానికి చెందిన వాడని వారు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఒకరోజు రాత్రి అతడు కాలేజీ హాస్టల్‌లో ఉండగా.. అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఆ తరువాత బయటికి వెళ్లిన మంజునాథ్ తిరిగి రాలేదు. మరుసటి రోజు హాస్టల్ సమీపంలోని ఒక చెట్టుకి మంజునాథ్ శవమై వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన జనవరి 21న జరిగింది.


పోలీసులు మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. అతను ప్రేమించిన యువతి కుటంబ సభ్యులే అతడిని చిత్రహింసలు పెట్టారని అందుకే మంజునాథ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అందరూ అనుకున్నారు. పోలీసులు ఈ కేసులో మంజునాథ్ ప్రేమించిన యువతి తండ్రిని అరెస్టు చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించినందకు కేసు కూడా పెట్టారు. కానీ నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు.


ఈ క్రమంలో మంజునాథ్ తండ్రి తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. తన కొడుకు హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని 'లై డిటెక్టర్ టెస్టు' చేశారు. అందులో నిందితుడు అతని సోదరులతో కలిసి మంజునాథ్ హత్య చేసి ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించారని తేలింది. 


పోలీసులు నిందితుడి బెయిల్ రద్దుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2022-02-13T05:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising