ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగిన మత్తులో భార్య ఎవరో.. అత్త ఎవరో గుర్తించలేకపోయిన మందుబాబు.. చివరకు జరిగిన ఘోరమిదీ..!

ABN, First Publish Date - 2022-07-19T23:50:35+05:30

అతనికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కూతురు కూడా ఉంది.. మద్యానికి బానిసైన ఆ వ్యక్తి తరచుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కూతురు కూడా ఉంది.. మద్యానికి బానిసైన ఆ వ్యక్తి తరచుగా భార్యతో గొడవపడుతుండేవాడు.. అతని తీరుతో విసిగిపోయిన భార్య కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేశాడు.. అయితే మద్యం మత్తులో భార్యకు బదులు ఆమె తల్లిని చంపేశాడు.. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. కర్ణాటకలో ఈ దారుణం జరిగింది. 


ఇది కూడా చదవండి..

Parrot Missing: చిలుక తప్పిపోయిందట.. వెతికి తీసుకొస్తే రూ.50 వేల నజరానా ఇస్తారట..!


కర్ణాటక రాష్ట్రంలోని సంజయ్ నగర్‌కు చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం భవ్యశ్రీతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు కూడా ఉంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజ్‌కు విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉంది. నాగరాజ్ వైవాహిక జీవితానికి ఈ వ్యసనం పెనుముప్పుగా మారింది. నిత్యం మద్యం మత్తులో ఉండే నాగరాజు తరచుగా భార్యతో గొడవ పడేవాడు. ఆమెపై భౌతిక దాడికి పాల్పడేవాడు. అతని గొడవలతో విసిగిపోయిన భవ్యశ్రీ మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. నాగరాజ్‌కు విడాకులు ఇచ్చేందుకు కూడా భవ్యశ్రీ సిద్ధమైంది.


భార్య విడాకులు కోరడంతో నాగరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అత్తింటికి వెళ్లి తన భార్యను తనతో పాటు పంపించాలని గొడవ చేశాడు. అతడితో వెళ్లేందుకు భవ్యశ్రీ అంగీకరించలేదు. దీంతో భార్యను సుత్తితో కొట్టి చంపాలనుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉండడంతో తన భార్యపై కాకుండా అత్తగారి తలపై సుత్తితో ఐదారు సార్లు కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నాగరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను భార్యను చంపాలని ప్లాన్ చేశానని,  అయితే మద్యం మత్తులో ఉండడంతో అత్తగారు ఎవరో, భార్య ఎవరో తెలియదని నాగరాజ్ పోలీసులకు తెలిపాడు.

Updated Date - 2022-07-19T23:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising