ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Parrot Missing: చిలుక తప్పిపోయిందట.. వెతికి తీసుకొస్తే రూ.50 వేల నజరానా ఇస్తారట..!

ABN, First Publish Date - 2022-07-19T22:34:43+05:30

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ చిలుక త‌ప్పిపోవడంతో దాని య‌జ‌మాని తీవ్ర ఆవేద‌న చెందుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఓ చిలుక త‌ప్పిపోవడంతో దాని య‌జ‌మాని తీవ్ర ఆవేద‌న చెందుతున్నాడు. చిలుక ఆచూకీ కోసం ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయినా ఆచూకీ దొరకడం లేదు. దీంతో త‌ప్పిపోయిన చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ. 50 వేలు న‌జ‌రానా ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశాడు. క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరు జ‌య‌న‌గ‌ర్ కాల‌నీకి చెందిన అర్జున్ అనే వ్యక్తి ఆఫ్రికాకు చెందిన రెండు చిలుక‌ల‌ను పెంచుకుంటున్నాడు. 


ఇది కూడా చదవండి..

అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అసభ్యకరంగా చాటింగ్.. ఇప్పుడు ఈ కుర్రాడి పరిస్థితి ఏంటంటే..


ఈ రెండింటిలో ఒక చిలుక గత శనివారం అర్జున్ ఇంటి నుంచి అదృశ్యమైంది. దాంతో అర్జున్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దాని కోసం ఎంతగానో గాలించాడు. అయినా ఫలితం కనిపించలేదు. తన చిలుక ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండని పోస్ట‌ర్ల‌ు కూడా అంటించాడు. తన చిలుక ఆచూకీ చెప్పిన వారికి రూ. 50 వేలు న‌జ‌రానా ఇస్తామ‌ని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఇంటి నుంచి అదృశ్యమైపోయిన చిలుకతో తమకు చాలా అనుబంధం ఉందని, అది వెళ్లిపోయిన దగ్గర్నుంచి తమ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారని అర్జున్ పేర్కొన్నాడు. 

Updated Date - 2022-07-19T22:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising