ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jr NTR: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే!

ABN, First Publish Date - 2022-12-10T11:30:31+05:30

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Jr ntr) ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి (America tour)వెళ్లారని తెలుస్తోంది. కుమారులు అభయ్‌ రామ్‌(Abhay ram), భార్గవ్‌ రామ్‌(Bhargav ram)తో కలిసి ఎయిర్‌ పోర్టులో స్టైలిష్‌గా నడిచి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ అక్కడే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లారని తెలుస్తోంది. కుమారులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌తో కలిసి ఎయిర్‌ పోర్టులో స్టైలిష్‌గా నడిచి వెళ్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నారు. నెల రోజులపాటు ఎన్టీఆర్‌ ట్రిప్‌కి వెళ్లినట్లు సన్నిహితుల నుంచీ సమాచారం. దీన్ని బట్టి ఎన్టీఆర్‌ కొత్త ఏడాదికి అక్కడే వెల్‌కమ్‌ చెప్పనున్నారు. సంక్రాంతి పండుగకు ముందు తారక్‌ ఇండియా రానున్నారు. జనవరి మూడోవారం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొనే ప్లాన్‌లో ఉన్నారట తారక్‌. జనతా గ్యారేజ్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌కు 30వ సినిమా. తారక్‌ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేలా కొరటాల శివ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేశారట. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ పతాకాలపై కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దీనికి ‘దేవర’ టైటిల్‌ ఖరారు చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.

Updated Date - 2022-12-10T11:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising