ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

shocking video : కన్నతండ్రిని కనికరం లేకుండా కర్రతో కొట్టిన కుమారుడు

ABN, First Publish Date - 2022-09-20T14:11:07+05:30

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలోని వీధుల్లో తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోధ్‌పూర్‌(రాజస్థాన్‌): రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరంలోని వీధుల్లో తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కుమారుడు ఎలాంటి కనికరం లేకుండా(mercilessly beating) వృద్ధుడైన కన్నతండ్రిని(elderly father) కర్రతో కొట్టిన ఘటన జోధ్‌పూర్‌ నగరంలో జరిగింది.తండ్రిని కొడుతున్న కుమారుడి వీడియోను చిత్రీకరించి(caught on camera) సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ షాకింగ్ వీడియో(shocking video) సోషల్ మీడియాలో(social media) హల్ చల్ అవుతోంది. జోధ్‌పూర్‌ నగరానికి చెందిన తండ్రీ కొడుకు మధ్య ఏదో వివాదం ఏర్పడింది. అంతే అకస్మాత్తుగా తెల్లటి టీ-షర్టు ధరించిన కుమారుడు వీధిలో పడి ఉన్న కర్రను తీసుకొని కన్నతండ్రిని కనికరం లేకుండా కొట్టాడు.


తండ్రి అయిన వృద్ధుడు విలపిస్తున్నా వదలకుండా కుమారుడు చావబాదాడు.వీడియోలో కనిపించని కొందరు ఇరుగుపొరుగు వారు దూరం నుంచి అతడిని ఎదిరించేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. అయినా కుమారుడు ఇరుగుపొరుగు వారికి దూరంగా వెళ్లి తన వృద్ధ తండ్రిని మళ్లీ  కొట్టాడు.ఈ ఘటన జరిగిన జోధ్‌పూర్‌ నగరంలోని(Jodhpur city) రతనాడ పోలీస్‌స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియోలోని ఓ యువకుడు తన తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు చెప్పారు.


ఈ ఘటనకు ఒకరోజు ముందు కుమారుడు తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించాడని పోలీసు అధికారి తెలిపారు.తండ్రిని కొట్టిన నిందితుడిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 కింద అరెస్టు(arrest) చేశామని జోధ్ పూర్ పోలీసులు చెప్పారు. మొత్తం మీద కన్నతండ్రిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   




Updated Date - 2022-09-20T14:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising