ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు ఆభరణాలు నిండిన బ్యాగుతో పెళ్లికి బయలుదేరిన మహిళ.. కల్యాణ మండపానికి చేరుకోగా బ్యాగులో ఆభరణాలు మాయం.. దారిలో ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-22T05:38:18+05:30

ఒక 57 ఏళ్ల మహిళ తన బంధువుల పెళ్లికి వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె పెళ్లిలో వేసుకోవడానకి తన బ్యాగులో బంగారు నగలు పెట్టుకొని ఒక ఆటోరిక్షా ఎక్కింది. కల్యాణ మండపం చేరుకున్న తరువాత ఆమె బ్యాగులో చూడగా.. బంగారు నగలు మాయమయ్యాయి. అది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా నగలు ఎక్కడ పోయాయోనని ఆందోళన పడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక 57 ఏళ్ల మహిళ తన బంధువుల పెళ్లికి వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె పెళ్లిలో వేసుకోవడానకి తన బ్యాగులో బంగారు నగలు పెట్టుకొని ఒక ఆటోరిక్షా ఎక్కింది. కల్యాణ మండపం చేరుకున్న తరువాత ఆమె బ్యాగులో చూడగా.. బంగారు నగలు మాయమయ్యాయి. అది చూసిన ఆ మహిళ ఒక్కసారిగా నగలు ఎక్కడ పోయాయోనని ఆందోళన పడింది. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దారిలో వచ్చిన ఆటోలోనే తన నగలు కాజేసరంటూ అనుమానం వ్యక్తం చేసింది. నిజానికి ఏం జరిగిదంటే..


మహానగరం ముంబైలోని డోంబివలి ప్రాంతంలో నివసించే మంజుల దేవి(57, పేరు మార్చబడినది) తన బంధువుల పెళ్లికి వెళ్లడానికి ఇంటి నుంచి ఒక బ్యాగులో బంగారు నగలు తీసుకొని బయలుదేరింది. కల్యాణ మండపం చేరుకోవడానకి ఆమె ఒక ఆటో రిక్షాలో ప్రయాణించింది. ఆ ఆటో రిక్షా డ్రైవర్ దారిలో మరో మహిళను కూర్చోపెట్టుకున్నాడు. ఆ రెండో మహిళ తనతో పాటు ఒక చంటి బిడ్డను తీసుకొని వచ్చింది. ఆ చంటి బిడ్డని  ఒక టవల్‌లో కప్పి తీసుకువచ్చింది. ప్రయాణం మధ్యలో ఆ బిడ్డను కాసేపు పట్టుకోమని మంజుల దేవికి చెప్పింది. 


మంజుల దేవి జాలి పడి ఆ బిడ్డను కాసేపు తన ఒడిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆ చంటి బిడ్డ తల్లి మంజుల దేవి దృష్టి మళ్లించి ఆమె పక్కన ఉన్న బ్యాగులో నుంచి నగలు కాజేసింది. ఆ తరువాత వెంటనే తన బిడ్డను తీసుకొని  ఆటోలో నుంచి దిగిపోయింది. ఈ విషయం మంజుల దేవి గమనించలేదు. ఆమె కల్యాణ మండపం చేరుకొని బ్యాగులో చూడగా.. నగలు కనపడలేదు. దీంతో మంజుల దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కూడా ఆ చంటి బిడ్డతో వచ్చిన మహిళతో కలిసి ఉన్నాడని అనుమానించి.. అతని కోసం గాలిస్తున్నారు. నగలు దొంగతనం కేసులో మంజుల దేవి వెళ్లిన మార్గంలోని సీసీటీవి వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు.



Updated Date - 2022-02-22T05:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising