ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra: మ్యాచ్ తర్వాత జపాన్ అభిమానులు ఏం చేస్తున్నారో చూడండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ABN, First Publish Date - 2022-11-23T15:09:16+05:30

ప్రముఖ పారిశ్రామిక వేత్త వర్తమాన వ్యవహారాలపై తన అభిప్రాయాలను చెప్పడంలోనూ, స్ఫూర్తివంతమైన వీడియోలను ఇతరులతో పంచుకోవడంలోనూ ముందుంటారు. తాజాగా ఆయన జపాన్ ఫుట్‌బాల్ అభిమానులకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలపై తన అభిప్రాయాలను చెప్పడంలోనూ, స్ఫూర్తివంతమైన వీడియోలను ఇతరులతో పంచుకోవడంలోనూ ఆనంద్ మహీంద్రా ముందుంటారు. తాజాగా ఆయన జపాన్ ఫుట్‌బాల్ అభిమానులకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఫిపా ప్రపంచకప్ ఖతార్‌లో (FIFA World Cup 2022) జరుగుతున్న సంగతి తెలిసిందే.

మంగళవారం మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్‌కు చెందిన ఫుట్‌బాల్ అభిమానులు స్టేడియంను శుభ్రం (Japanese fans clean up stadium) చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వారి వారి జట్టు ఆడలేదు. అయినా ప్రేక్షకులు వెళ్లిన తర్వాత జపాన్ పురుషులు, మహిళలు స్టేడియంను శుభ్రం చేశారు. మీరు ఈ పని కెమెరాల కోసం చేస్తున్నారా అని అడిగినప్పుడు, వారి స్పందన నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. మేం అలా వెళ్లిపోలేం. జపనీయులు ఎప్పుడూ చెత్తను వదిలేసి వెళ్లిపోరు. మేము ఉన్న స్థలాన్ని గౌరవిస్తామ ని జపాన్‌కు చెందిన మహిళ అన్నారు. షింటో సాంప్రదాయం ప్రకారం జపనీయులు పరిశుభ్రతే దైవం (cleanliness is godliness) అని నమ్ముతారు.

Updated Date - 2022-11-23T15:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising