ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఆధార్‌కార్డు ఉంటే రూ.5లక్షల బ్యాంకు రుణం..? మోదీ ప్రభుత్వం బంపరాఫర్‌ వార్తల్లో నిజమెంత..?

ABN, First Publish Date - 2022-08-19T15:06:21+05:30

‘మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఈజీగా బ్యాంకులో రుణం( Rs.5 lakh on Aadhaar card) తీసుకోవచ్చు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండానే కేవలం ఆధార్ కార్డుపై ఏకంగా రూ.5లక్షల వరకు రు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఈజీగా బ్యాంకులో రుణం( Rs.5 lakh on Aadhaar card) తీసుకోవచ్చు. ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండానే కేవలం ఆధార్ కార్డుపై ఏకంగా రూ.5లక్షల వరకు రుణం పొందొచ్చు’ అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. నిజంగానే మోదీ ప్రభుత్వం ఇటువంటి స్కీమ్‌ను ప్రకటించిందా? ఆధార్ కార్డుపై బ్యాంకులు అంత పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నాయా? అనే పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.


సైబర్ కేటుగాళ్లు ఈ మధ్య ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మెసేజ్‌ల రూపంలో కాల్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సమాచారన్ని రాబట్టుకుని బ్యాంకు అకౌంట్లోని సొమ్మును కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ‘మోదీ ప్రభుత్వం(Modi government) బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఆధార్ కార్డుపై రూ.5లక్షల బ్యాంకు రుణం పొందొచ్చంటూ’ సోషల్ మీడియాలో(Viral in Social Media) వైరల్ అవుతున్న ఈ వార్తను ఎంత వరకు నమ్మాలని కొందరు సందేహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో తమకు తెలిసిన సమాచారాన్ని ముందు వెనకా ఆలోచించకుండా ఇతరలకు షేర్ చేసేస్తున్నారు. 



ఈ నేపథ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఫ్యాక్ట్ చేస్తే.. ఆ సమాచారం అవాస్తవం అని తేలింది. కేవలం ఆధార్ కార్డు ఆధారంగా రూ.5లక్షల బ్యాంకు రుణం పొందేలా మోదీ ప్రభుత్వం ఎటువంటి స్కీం‌ను ప్రకటించలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌(PibFactCheck)లో వెల్లడైంది. ఇటువంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మి, వ్యక్తిగత సమాచారాన్ని చెప్పొద్దని సూచించింది. అనాలోచితంగా ఇతరులకు ఇటువంటి వార్తలను షేర్ చేయవద్దని కూడా పేర్కొంది. 


ఆధార్ కార్డుతో లక్ష రూపాయల రుణం తీసుకోవచ్చు..

ఆధార్ కార్డుతో బ్యాంకు రుణం తీసుకోవడానికి వీలు లేదా అంటే.. ఉంది. సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ బాగుంటే.. కొన్ని బ్యాంకులు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు అడగకుండానే కేవలం ఆధార్ కార్డుపై లక్ష రూపాయల వరకు రుణాలు ఇస్తున్నాయి.


Updated Date - 2022-08-19T15:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising