ఐక్యూ అధికంగా కలిగినవారు ప్రత్యేకంగా ఏమి చేస్తుంటారు? వీరు ఇతరులకు భిన్నంగా ఉండటానికి కారణం ఇదే...
ABN, First Publish Date - 2022-10-12T17:41:29+05:30
మీరు మీ ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి (తెలివితేటల ప్రమాణ నిర్ణయం) ని పెంచుకోవాలనుకుంటే ...
మీరు మీ ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి (తెలివితేటల ప్రమాణ నిర్ణయం) ని పెంచుకోవాలనుకుంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ఏమి చేస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం మీ ఐక్యూని పదును పెట్టడానికి మీకు సహాయపడుతుంది. ఐక్యూ అధికంగా కలిగినవారు ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ ఉంటారు. వీరిలోని కొందరు ప్రతిరోజూ ఒక పుస్తకాన్ని ఖచ్చితంగా చదువుతారు. అలాంటి వారి మదిలో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులుతుంటాయి. పలు అంశాల గురించిన వీలైనంత అధిక సమాచారాన్ని పొందాలనే కోరికను కలిగి ఉంటారు.
అధిక ఐక్యూ ఉన్నవారు ప్రశ్నలు అడగడానికి వెనుకాడరు. తమ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అధిక ఐక్యూ కలిగినవారు ఏదైనా అంశంపై బ్యాలెన్సడ్‌గా ఆలోచిస్తారు. ఒక నిర్ణయానికి వచ్చే ముందు వారు రెండు విధాలుగా ఆలోచిస్తారు. అలాంటి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటివారు తమను తాము ఎప్పుడూ పరిమితం చేసుకోరు. విభిన్న విషయాలను నేర్చుకోవడానికి నిరంతరం సిద్ధంగా ఉంటారు. అధిక ఐక్యూ కలిగిన వ్యక్తులు సవాళ్లకు భయపడరు. వాటిని స్వీకరిస్తారు. మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచేందుకు పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. తద్వారా వారి మెదడు చురుకుగా పని చేస్తుంది.
Updated Date - 2022-10-12T17:41:29+05:30 IST