ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను అసలు పెళ్లే చేసుకోను.. అంటూ నేరుగా వధువుకే లేఖ.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఈ వ్యక్తి కథేంటంటే..

ABN, First Publish Date - 2022-01-26T20:55:32+05:30

ఓం ప్రకాష్ పోశ్వాల్ అలియాస్ గాంధీ.. హర్యానాలోని యమునా నగర్ జిల్లాకు చెందిన ఈయనను తాజాగా పద్మ శ్రీ అవార్డు వరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓం ప్రకాష్ పోశ్వాల్ అలియాస్ గాంధీ.. హర్యానాలోని యమునా నగర్ జిల్లాకు చెందిన ఈయనను తాజాగా పద్మ శ్రీ అవార్డు వరించింది. స్వామి వివేకానంద, స్వామి దయానంద్‌ల స్ఫూర్తితో సామాజిక సేవను ప్రారంభించిన ఓం ప్రకాష్ అందుకోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. సామాజిక సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. వివాహానికి దూరంగా ఉన్నారు. బాలికలకు విద్యను అందించేందుకు విశేషంగా కృషి చేశారు. ఆయన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 


ఫిబ్రవరి 1, 1942లో జన్మించిన ఓం ప్రకాష్ అగ్రికల్చర్‌లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం కూడా సంపాదించారు. అయితే సమీప గ్రామాల్లోని బాలికలు పేదరికం, వివక్ష మొదలైన కారణాల వల్ల విద్యకు దూరం కావడం ఆయణ్ని కలిచివేసింది. దీంతో ఆయన తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సామాజిక సేవలోకి దిగారు. `గుర్జార్ కన్యా గురుకుల్` పేరుతో ఓ పాఠశాలను 1985లో స్థాపించారు. ప్రతి గ్రామానికి తిరిగి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి బాలికలను ఆ పాఠశాలలో చేర్పించారు. ఉచితంగా విద్యను అందించారు. ప్రస్తుతం `గుర్జార్ కన్యా గురుకుల్` ఆ ప్రాంతంలోనే అతి పెద్ద బాలికల విద్యా కేంద్రంగా నిలిచింది. 


యుక్త వయసులోనే ఉండగానే ఓం ప్రకాష్‌కు ఆయన తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. సామాజిక సేవ చేసేందుకు పెళ్లి అడ్డంకిగా మారుతుందని ఎంత నచ్చచెప్పినా వారు వినలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. దీంతో ఓం ప్రకాష్ నేరుగా వధువుకు లేఖ రాశారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బ్రహ్మచారిగానే ఉండి సామాజిక సేవ చేయాలనుకుంటున్నానని తెలిపారు. దీంతో వధువు తరఫు వారు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. అప్పట్నుంచి ఓం ప్రకాష్ బాలికల విద్య, నిరక్ష్యరాస్యత, హిందూ-ముస్లిం ఐక్యత మొదలైన అంశాలపై దృష్టి సారించి జీవితం గడిపారు. 

Updated Date - 2022-01-26T20:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising