ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Interesting News: ఇలా కూడా కోట్లు సంపాదించొచ్చా..? ఏకంగా రూ.80 కోట్లను ఏం పని చేసి సంపాదించారో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-09-23T15:56:20+05:30

కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాలంటే.. తీవ్రంగా శ్రమించాల్సిన పని లేదు. అలా అని ఏ బ్యాంకుకూ కన్నం వేయాల్సిన పనీ లేదు. ఒక్కటంటే కేవలం ఒకే ఒక్క పనితో జీవితం సెట్ అవుతుంది. సక్రమ మార్గంలో ఏకంగా రూ.80 కోట్ల వరకూ సంపాదించొచ్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాలంటే.. తీవ్రంగా శ్రమించాల్సిన పని లేదు. అలా అని ఏ బ్యాంకుకూ కన్నం వేయాల్సిన పనీ లేదు. కేవలం తేళ్ల పెంపకం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇదే విషయాన్ని టర్కీలో కొందరు నిరూపిస్తున్నారు. ఇంతకూ మ్యాటర్ ఏంటంటే..


టర్కీలో కొందరు ల్యాబరేటరీలలో తేళ్లను పెంచుతూ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. దాదాపు 20వేల తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన విషాన్ని లీటర్ల కొద్దీ జమ చేసి.. ప్రత్యేక విధానంలో పౌడర్‌గా మార్చేస్తున్నారు. అనంతరం ఒక లీటర్ విషం ద్వారా సేకరించిన పౌడర్‌ను దాదాపు రూ.80కోట్లకు యూరప్‌కు అమ్మేస్తున్నారు. అయితే.. ఒక్క తేలు నుంచి అత్యధికంగా 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే లభిస్తుందట. అయితే.. భారత్‌లో మాత్రం ఇటువంటి పరిశ్రమలు ఉన్నట్టుగా ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. భారత దేశంలో కూడా ఇలా తేళ్లను పెంచేందుకు అనుమతులు, సదుపాయాలు ఉన్నట్టైతే.. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి మనవాళ్లకు ఇదొక మంచి ఆదాయ మార్గం అవుతుంది.


తేలు విషానికి అంత డిమాండ్ ఎందుకంటే..

తేలు విషంలో ఉండే కాంపోనెంట్స్ ద్వారా కీళ్ల వాతాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించొచ్చట. అలాగే కీళ్ల నొప్పులను కూడా నయం చేయవచ్చట. రోగ నిరోధక మందులు, సౌందర్య సాధనాల్లో తేలు విషాన్ని అత్యధికంగా వాడుతారట. 


Updated Date - 2022-09-23T15:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising