ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ రైలుకు ఇంధనం భూమి శక్తి.. పట్టాలపై ఎలా పరుగులు తీస్తుందంటే..

ABN, First Publish Date - 2022-03-05T15:15:24+05:30

డీజిల్, బొగ్గు అవసరం లేకుండా రైలు నడిపేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీజిల్, బొగ్గు అవసరం లేకుండా రైలు నడిపేందుకు ఆస్ట్రేలియాలో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నూతన తరహా రైలు పేరు ఇన్ఫినిటీ ట్రైన్. దీనిని ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ రూపొందిస్తోంది. ఐఎఫ్ఎల్ సైన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు కాలుష్యాన్ని తగ్గిస్తుంది, సున్నా ఉద్గారాలను లక్ష్యంగా చేసుకున్న ఆస్ట్రేలియా ఈ రైలును పట్టాలపైకి ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది.  అయితే ఈ రైలు ఎలా నడుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 


ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ Fortescue ఈ ప్రత్యేక తరహా రైలును తీర్చిదిద్దేందుకు విలియమ్స్ అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ (WAE) కంపెనీని కొనుగోలు చేసింది. ఎనర్జీ ఎప్పటికీ అయిపోని రైలును రూపొందించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఇంధనం విషయంలో ఈ రైలు దాని పేరుకు అనుగుణంగా ఉంటుంది, అంటే అనంతం(ఇన్ఫినిటీ). గురుత్వాకర్షణ శక్తి ఈ రైలుకు ఇంధనంగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రైలు పట్టాలపై నడుస్తుండగా దానంతట అదే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఈ రైలు నడిచేందుకు భూమికి గల గురుత్వాకర్షణ శక్తి అవసరం. ఈ రైలు సహాయంతో ఇనుప ఖనిజాన్ని అతి తక్కువ ఖర్చుతో ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలించవచ్చు. 244 కోచ్‌లు కలిగిన ఈ రైలులో 34,404 టన్నుల ఇనుప ఖనిజాన్ని నింపి, దానిని దించిన తర్వాత రైలు ఖాళీగా తిరిగి వచ్చినప్పుడు, దానిని గ్రావిటీ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. పునరుత్పాదక శక్తితో నడిచే వాహనానికి ఈ రైలు ఉదాహరణగా నిలుస్తుందని ఫోర్టెస్క్యూ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ తెలిపారు. భూమి గురుత్వాకర్షణ శక్తితో ఛార్జ్ అయ్యే ఈ రైలు రవాణా రంగంలో పెను మార్పులను తీసుకురానుందనడంలో ఎటువంటి సందేహం లేదు.  


Updated Date - 2022-03-05T15:15:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising