ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి నుంచి పసిబిడ్డ చోరీ.. ఫిర్యాదు చేసిన తల్లికి షాకింగ్ వార్త చెప్పిన వైద్యులు.. విచారణలో తలలు పట్టుకుంటున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-03-02T05:44:15+05:30

ఓ ప్రభుత్వా ఆస్పత్రిలో ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు ఆ బిడ్డను ఎవరో దొంగతనం చేశారు. ఆ మహిళ తన బిడ్డ పోయిందంటూ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కి ఫిర్యాదు చేయగా.. వారు ఆమెకు ఒక షాకింగ్ వార్త చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ ప్రభుత్వా ఆస్పత్రిలో ఒక మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు ఆ బిడ్డను ఎవరో దొంగతనం చేశారు. ఆ మహిళ తన బిడ్డ పోయిందంటూ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కి ఫిర్యాదు చేయగా.. వారు ఆమెకు ఒక షాకింగ్ వార్త చెప్పారు. దీంతో ఆ మహిళ ఆస్పత్రిలో తనకు మోసం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది.


వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఇటీవల పద్మ కుమారి(పేరు మార్చబడినది) ఒక మహిళ ఒక పసిబిడ్డను జన్మనిచ్చింది. అదేరోజు సాయంత్రం బిడ్డను ఎవరో దొంగతనం చేశారు. తన బిడ్డ కనబడడం లేదని పద్మ కుమారి ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె గురించి ఆస్పత్రి రికార్డులు చూసిన అధికారులు ఆమెకు షాకింగ్ వార్త చెప్పారు. పద్మకు అసలు గర్భసంచి లేదని.. మరి ఆమెకు బిడ్డ ఎలా పుట్టిందని రివర్స్ అయ్యారు. 


ఆస్పత్రిలో తన బిడ్డను చోరీ చేసి.. పైగా తనకు గర్భసంచి లేదని అధికారుల బుకాయిస్తున్నారని పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా విచారణ చేసిన పోలీసులు ఆస్పత్రి అధికారులను నమ్మారు. కానీ పద్మ తను గర్భవతిగా ఉన్న సమయంలో టీకాలు వేసిన ఆశా వర్కర్, తనకు సీమంతం చేసిన బంధువులను సాక్ష్యాలుగా తీసుకువచ్చింది. వారంతా పద్మ ఇంతకుముందు గర్బవతిగా ఉన్నదని పోలీసులకు చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడు పద్మకు టీకాలు, మందులు తనే ఇచ్చానని ఆశావర్కర్ చెప్పింది. ఇది విన్న పోలీసులు ఎవరిని నమ్మాలో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. 


పసిబిడ్డను ఆస్పత్రిలోనే పక్కా ప్లానింగ్ చేసి చోరీ చేశారని పద్ద బంధువులు నిరసనకు దిగారు. దీంతో జిల్లా పోలీసుల ఉన్నతాధికారులు ఈ కేసుని మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు.


Updated Date - 2022-03-02T05:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising