ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 మంది విద్యార్థినులను గర్భవతులను చేసిన కీచక టీచరుకు జీవిత ఖైదు

ABN, First Publish Date - 2022-02-15T18:41:33+05:30

ఇండోనేషియా దేశంలో మతపరమైన బోర్డింగ్ పాఠశాలల్లో చదువుతున్న 13 మంది బాలికలపై అత్యాచారం చేసిన కీచక ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు విధిస్తూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండుంగ్ (ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలో మతపరమైన బోర్డింగ్ పాఠశాలల్లో చదువుతున్న 13 మంది బాలికలపై అత్యాచారం చేసిన కీచక ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు విధిస్తూ ఇండోనేషియా కోర్టు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. పశ్చిమ జావాలోని బాండుంగ్ జిల్లా కోర్టు హెరీ విరావాన్ 13 మంది బాలికలపై కీచక ఉపాధ్యాయుడు అత్యాచారం చేయగా, వారిలో 8 మంది గర్భం దాల్చినట్లు నిర్ధారించింది. నిందితుడు ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో స్కాలర్‌షిప్‌లతో చదువుతున్న పేద కుటుంబాల నుండి చాలా మంది పిల్లలపై అత్యాచారం చేసినట్లు వెల్లడైంది.గత ఏడాది తమ టీనేజీ కుమార్తెపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయగా గర్భం దాల్చిందని విద్యార్థిని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ప్రెసిడెంట్ జోకో విడోడో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారని సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. 


దోషికి కెమికల్ కాస్ట్రేషన్, మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు.న్యాయమూర్తి యోహన్నెస్ పూర్నోమో సూర్యో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో విరావన్ చేతికి సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకువచ్చారు.నిందితుడు తన పిల్లలను పెంచుకోడానికి అనుమతించాలని న్యాయమూర్తిని కోరాడు.బాధితులకు నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లిస్తుందని కోర్టు పేర్కొంది.నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్మన్ సుశాంటో మాట్లాడుతూ మంగళవారం నాటి తీర్పుతో బాధితులకు న్యాయం జరిగిందన్నారు. బాండుంగ్ రేప్ కేసు వెలుగుచూడటంతో కొన్ని పాఠశాలల్లో లైంగిక వేధింపుల సమస్యపై దృష్టి సారించింది. గత సంవత్సరం దక్షిణ సుమత్రాలోని ఒక బోర్డింగ్ స్కూల్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు ఏడాది వ్యవధిలో 26 మంది మగ విద్యార్థులను లైంగికంగా వేధించినందుకు వారిని అరెస్టు చేశారు.



Updated Date - 2022-02-15T18:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising