ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cruel Husband: భర్త క్రూరత్వాన్ని భరించలేక మహిళ ఆత్మహత్య.. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు వెల్లడి!

ABN, First Publish Date - 2022-08-09T03:07:49+05:30

సమాజం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నా కొందరు ఇంకా ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాజం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నా కొందరు ఇంకా ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నారు. తమకు మగపిల్లలే పుట్టాలని కోరుకుంటున్నారు. ఆడపిల్ల పుడితే భార్యపై వేధింపులకు పాల్పడుతున్నారు. అమెరికా వెళ్లి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఆ ధోరణి నుంచి బయటపడలేకపోవడం విషాదకరం. మగ పిల్లను కనలేదనే కారణంతో భర్త వేధింపులకు గురైన ఓ మహిళ తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌ (New York)లో  ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో ద్వారా భర్త గురించి మాట్లాడింది. 


ఇది కూడా చదవండి..

Shocking video: అకస్మాత్తుగా విరిగిపడిన కొండచరియలు.. జాతీయ రహదారిపై షాకింగ్ ఘటన!


ఉత్తర‌ప్రదేశ్‌లోని (Uttar pradesh) బిజ్నూర్‌కు చెందిన మన్‌దీప్ కౌర్‌కు, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు రంజోధ్‌బీర్ సింగ్‌తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. దీంతో మన్‌దీప్‌ను ఆమె భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. ఆమెను గత 8 ఏళ్లుగా మాన‌సికంగా, శారీర‌కంగా హింసిస్తున్నారు. ఆ వేధింపుల భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. అలాగే తన అత్తింటి వారి అకృత్యాలను వెల్లడించింది. 


`ప్రతిరోజూ ఏడుస్తూనే ఎనిమిదేళ్లు గడిపేశాను. ఏదో ఒక రోజు అతను తన తీరును మార్చుకుంటాడనే ఆశతో ఇవన్నీ సహించాను. ఇక, నాలో సహనం నశించింది. కొడుకు పుట్టలేదనే అక్కసుతో అతడు పెట్టే హింసలు తట్టుకోలేకపోతున్నాను. భర్త, అత్తమామలు నన్ను ఆత్మహత్య దిశగా ప్రేరేపించార`ని మన్‌దీప్ ఆ వీడియోలో పేర్కొంది. అలాగే  తన శరీరంపై ఉన్న గాయల గుర్తులను కూడా చూపించింది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రంజోధ్‌బీర్ సింగ్‌, అతని తల్లిదండ్రులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-09T03:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising