ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ హిందూ అబ్బాయి.. మొరొక్కో ముస్లిం అమ్మాయి.. దేశాలు దాటి ఒక్కటైన ప్రేమ జంట.. ఈ ప్రేమికులకు ఎన్ని కష్టాలు ఎదురయ్యాయంటే..

ABN, First Publish Date - 2022-01-21T09:53:57+05:30

ప్రేమకు మతం, కులమే కాదు దేశ సరిహద్దులు కూడా అడ్డుగా నిలువలేవని నిరూపించారు ఇద్దరు ప్రేమికులు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరానికి చెందిన అవినాశ్(26) అనే యువకుడికి సోషల్ మీడియా ద్వారా మొరొక్కో దేశంలో నివసించే ఫాద్వా లైమాలీ (24) అనే యువతికి పరిచయమయ్యాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమకు మతం, కులమే కాదు దేశ సరిహద్దులు కూడా అడ్డుగా నిలువలేవని నిరూపించారు ఇద్దరు ప్రేమికులు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరానికి చెందిన అవినాశ్(26) అనే యువకుడికి సోషల్ మీడియా ద్వారా మొరొక్కో దేశంలో నివసించే ఫాద్వా  లైమాలీ (24) అనే యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. 


ప్రియురాలు ఫద్వా కోసం అవినాశ్ ధైర్యం చేసి మొరాక్కో వెళ్లాడు. అక్కడ ఆమె తండ్రి అలీ లైమాలీతో తమ ప్రేమ గురించి చెప్పి వివాహం కోసం అనుమతి కోరాడు. కానీ ఫద్వా తండ్రి అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఫద్వా పట్టుబట్టడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే అలీ లైమాలీ వారిద్దరి వివాహానికి ఒక షరతు విధించాడు. అవినాశ్‌ను ఇస్లాం మతం స్వీకరించి ముస్లింగా మారాలని చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకొని మొరాక్కోలేనే ఉండిపోవాలన్నాడు. 


ఫద్వా తండ్రి విధించిన షరతులకు అవినాశ్ అంగీకరించలేదు. పైగా ఫద్వా కూడా అవినాశ్‌తో కలిసి భారత్‌కు వెళ్లిపోతానని కచ్చితంగా చెప్పింది. కూతురి సంతోషం కోసం చివరికి తండ్రి ఒప్పుకున్నాడు. మొరాక్కో ఒక ముస్లిం దేశం. అక్కడ 99 శాతం జనాభా ముస్లింలే.. పైగా అక్కడ రాచరిక ప్రభుత్వం. అందుకే ఫద్వా వివాహానికి ప్రభుత్వ అనుమతి లభించేందుకు చాలా సమయం పట్టింది. 


అన్ని అడ్డంకులు దాటుకొని భారత్ రావాలనుకున్న ఫద్వాకు కరోనా చివరి అడ్డంకిగా మారింది. కరోనా కేసుల తగ్గేంత వరకు అవినాశ్, ఫద్వాలు ఎదురుచూసి ఇటీవలే భారత్ చేరుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి భారత ప్రభుత్వానికి అప్పీలు చేసుకొన్నారు. అన్ని నియమాలు పాటించి ప్రభుత్వ అనుమతితో బుధవారం ఇద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం అవినాశ్ మాట్లాడుతూ.. తన భార్య ఫద్వాకు ఎప్పుడూ మతం మారాలని ఒత్తిడి చేయనని చెప్పాడు.

Updated Date - 2022-01-21T09:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising