ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే అనూహ్య ఘటన.. Helmet ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డ మహిళ!

ABN, First Publish Date - 2022-06-30T18:22:48+05:30

ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. మహిళ ద్విచక్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే ఏం జరిగింది? ఆమె ప్రాణాలను  Helmet ఎలా రక్షించింది. అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..


మలేషియాకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని నడుపిస్తుంటే.. ఓ మహిళ మాత్రం అతడి వెనకాల కూర్చొంది. వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం.. పెనాంగ్‌లో ఉన్న వీధి గుండా వెళ్తుంగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టు మీద నుంచి ఓ కొబ్బరి కాయ రాలి.. వెనకాల కూర్చున్న మహిళ తలపై పడిపోయింది. అయితే లక్కీగా ఆమె హెల్మెట్ ధరించి ఉన్నందున తలకు బలమైన దెబ్బ తగలలేదు. అయితే.. పై నుంచి కొబ్బరి కాయ ఫోర్స్‌గా మీద పడటంతో ఆమె ధరించిన హెల్మెట్ ఊడిపోయింది. ఇదే సమయంలో సదరు మహిళ కూడా బండిపై నుంచి కింద పడిపోయింది. లక్కీగా వెనకాల నుంచి ఎటువంటి వాహనాలూ రాకపోడంతో చిన్నచిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. కాగా.. ఇందకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గ మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఒకవేళ హెల్మెట్ లేకున్నట్టైతే.. తలకు తీవ్ర గాయమై ఆమె మరణించి ఉండేదని’ కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరేమో.. ‘ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-06-30T18:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising