ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: వామ్మో.. జస్ట్ మిస్.. రోడ్డుపై సైకిల్‌పై వెళుతున్న యువకుడికి భయంకర అనుభవం..!

ABN, First Publish Date - 2022-06-16T23:04:14+05:30

ఒక వ్యక్తి అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో సైకిల్ తొక్కుతున్నాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక వ్యక్తి అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో సైకిల్ తొక్కుతున్నాడు.. అది అటవీ ప్రాంతం కావడంతో అతడికి షాకింగ్ అనుభవం ఎదురైంది.. రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి ఓ చిరుత హఠాత్తుగా ఆ యువకుడిపై దూకింది.. వెంటనే అతడు సైకిల్ పై నుంచి కింద పడిపోయాడు.. చిరుత వెంటనే పారిపోయింది.. ఆ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 


హఠాత్తుగా చిరుత మీదకు దూకడంతో ఆ సైక్లిస్ట్ కింద పడిపోయాడు. చిరుత అతడిని ఏమీ చేయకుండా వెనక్కి పారిపోయింది. ఆ యువకుడు కూడా సైకిల్ వెనక్కి తిప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆ సైక్లిస్ట్‌కు గాయాలేం కాలేదు. `ఈ సంఘటన జనవరిలో కజిరంగా వద్ద జరిగింది. చిరుత హైవేని దాటడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సైక్లిస్ట్ వచ్చాడు. నాకు తెలిసి ఇద్దరూ అదృష్టవంతులు. చిరుతపులి ఢీకొట్టడంతో ఆ సైక్లిస్ట్‌ పరిస్థితి ఏంటో ఊహించండి.. ఆ సైక్లిస్ట్ చాలా అదృష్టవంతుడ`ని ఆయన కామెంట్ చేశారు. 

Updated Date - 2022-06-16T23:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising